Pages

బంధాల కోసం బంగారు తల్లులు!

Wednesday, 28 March 2012
                      బంధాల కోసం బంగారు తల్లులు!


                                   నిషిని మనిషిగా చూడలేని ఈ రోజులలో బందాలు,బంధుత్వాల కోసం ప్రాకులాడుతున్న వారిని చూసి తప్పు ఎవరిదీ అని ఆలోచిస్తే నాకు ఇలా వ్రాయాలనిపించింది.ఒకప్పుడు ఒక బందం ఏర్పడితే దాని చుట్టూ ఉన్న ఎన్నో బంధుత్వాలకు,బంధువులకు విలువనిచ్చేవారు.బందాలకు,బంధుత్వాలకు,సాంప్రదాయాలకు ఎవరికీ వారు మనసా,వాచ,కర్మణ అలా కట్టుబడి ఉండేవారు.తరం అనే తరగతుల బడిలో ఎన్నో మార్పులు.మార్పు మంచికే కాని బంధాలను గుర్తుతెచ్చుకునే స్థితికి దిగజారిన మార్పును చూసి నాకు అసహ్యాం వేస్తుంది.
                                    బిడ్డల కోసం  తల్లిదండ్రులు పడుతున్న తపన,వాళ్ళ ఆరోగ్యం,చదువు,ఉద్యోగం ఇలా ఎన్నీటి కోసమో వాళ్ళ ఆకలి,కష్టం,సుఖం,సంతోషాన్నీ దారపోసి పెంచి పెద్ద చేస్తే ఎదిగిన బిడ్డ "నువ్వు ఎలా వున్నావు అమ్మ" అనే తీరిక లేదు.తన జీవిత లక్ష్యాల కోసం ఎంతో దూరం వెళ్లిపోతుంటే ఇంకెక్కడి బంధం,బంధుత్వం.
                              ప్పటికైన రారా అని కళ్ళలో ఎదురు చూపు,మనస్సులో చావని మమకారంతో ఆ తల్లి యుక్త వయస్సులోంచి వృద్ధాప్యానికి చేరింది.అలా ఎదురు చూస్తున్న తల్లికి ఏ బిడ్డ మారిన,ఈ కాలంలో మమకారం అనే దారంతో ప్రతి బంధాన్నీ ముడివేస్తూ,సంతోషాల హారాన్నీ అల్లగలరు.వృద్ధాప్యంలో ఎదురు చూస్తున్నఆ బంగారు తల్లికి ఏ బంగారు బిడ్డ ఆ హారాన్ని అందించగలడు!ఏం  మీరు కాలేరా...రేపు ఇదే పరిస్తితి మనకు ఎదురైనప్పుడు ఎవరిని నిందించాలి?మనలనా,మన బిడ్డలనా ? తీరిక లేదని తీరం దాటే ముందు,ఒక్క నిమిషం లేదా ఒక్క సెకను ఆలోచించండి."వృద్ధాప్యం" అనే పసితనంలో ఉన్న ప్రతి తల్లికి,ప్రతి తండ్రికి మన ప్రేమ,ఆభిమానం,ఆప్యాయత,తోడూ,నీడ  కావాలి.అధించాలని ఉంది కాని అందుబాటులో లేము అని అనుకోవద్దు.రేపు మన ఉనికిని గర్వంగా చాటుకోవాలంటే మొదలును కాపాడండి.ఇది నా మనవి !!

                                                             - అను మిట్టసల.
Read more ...

మృత్యువు..!

Monday, 26 March 2012
                 మృత్యువు..!



మదిలో కలిగే భావాలను వ్యక్తపరచలేక సమాధి చేస్తుంటే... 
మరణలోతుల్లో నిజాలు మరణ మృదంగాలు వాయిస్తున్నాయి !
వలపు వాకిళ్ళు తెరవలేక మనస్సు మదనపడుతుంటే !
చేజారుతున్న జీవితాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియక !
మనస్సు మృత్యువు ఒడిలో జారిపోతున్న క్షణం,
హృదయం వేధనతో కన్నీరు కారుస్తుంది !!

ఆశలు ఆవిరై,ఆశయాలు కరిగిపోతున్నా ... 
నాది - నాకు అనే స్వార్ధం తెలియని మనస్సు...
మారుతున్న ప్రపంచంతో పోటిపడలేవని...
నూరేళ్ళ జీవితం వెనక్కి తిరిగి వేకిరిస్తుంది !
అలసిపోతున్న జీవిని నిస్వార్ధంగా మృత్యువు సేదతీరమంటుంటే...
హృదయం వేధనతో కన్నీరు కారుస్తుంది !!

సంతోషంలో గుర్తురాని మృత్యువు...
నేను నీ ఆకరి ఘట్టాన్నీ అని ...
నా ధుఖ్ఖాన్నీ ఆసరాగా చేసుకుంటుంది !
నాకు నీ తోడు అవసరం లేదు అని మృత్యువుతో చెప్పలేక...
ఆహ్వనాన్నీ తిరస్కరించలేక నలిగిపోతుంటే...
హృదయం వేధనతో కన్నీరు కారుస్తుంది !!

                                        - అను మిట్టసల.
Read more ...

ఎవరి ప్రపంచం వారిది..!

Sunday, 25 March 2012
                          ఎవరి ప్రపంచం వారిది..!


ఎవరి ప్రపంచం వారిది,తెలియనప్పుడు..
నీ పలకరింపుతో ఇరు ప్రపంచాలను ఏకం చేశావు !
ఈ ప్రపంచాన్ని నీ కళ్ళతో చూపించవు..
నీకున్న బాధలు,కష్టాలు చాల చిన్నవి అనిపించాయి నాకు !
నా కళ్ళతో చూసి సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించుకో,
అన్నింటా,నీ నీడలా నేనుంటాను తోడుగా నీకు !

                                  - అను మిట్టసల.
Read more ...

ప్రేమ ఖరీదు..!

Sunday, 25 March 2012
                   ప్రేమ ఖరీదు..!


ప్రేమిస్తే ప్రాణం ఇవ్వకు...
                     అది నా సొత్తు !
ప్రేమ విఫలమైతే ప్రాణం ఇవ్వకు...
                    అది నీ తల్లిదండ్రుల సోత్తు !
ప్రేమ ఖరీదు ప్రాణం కాదు...
                    ప్రేమతో ప్రేమించబడటం !
నాకు కావలసింది నీ తొడు-నీడా కాదు...
                  కేవలం నువ్వు !
నిజమైన ప్రేమకు అర్దాలు లేవు...
                 మనస్సుని అర్ధం చేసుకోవటం తప్ప !
ఒకరి మనస్సు తాళం మరొకరికి దొరికేదే.....ప్రేమ అంటే !


                                          - అను మిట్టసల.
 
Read more ...

నీ కోసం...!

Thursday, 22 March 2012
                                   నీ కోసం...!


నాకు ఏమి చెప్పలేక మౌనంగా వుంటే,
       నీ మౌనానికి నిశబ్ధంలా నేనుండిపోతాను !
నీ కంటి వెనుక కన్నీరులా నేనిలచిపోతను !
     నేనే నీకు దూరంగా ఉన్ననూ,నా మనస్సు కాదు !
ప్రపంచంలో ప్రతి ఒక్కరిలో స్వార్ధం ఉంది,
    నాలోనూ ఉంది ప్రపంచంలోని సంతోషమంతా,
                                              నీ సొంతం కావాలని !
ఇంకెంత కాలం భాదలో మునిగిపోతావు.అందుకే,
     కొంత నా సొంతం చేసుకొని వెళ్ళిపోతాను !

నీ కోసం ఎమైన ఇచ్చేస్తాను,నా ప్రాణం తప్ప !
      ఎందుకంటే నీ కోసం దేవుడిని ఎదిరించాలి కాబ్బటి !
నీ దుఖ్ఖని పంచుకొగలను కాని,దాని నీకు దూరం చెయ్యలేను !
     నీ ప్రతి అడుగులో నేనుండాలి అనుకున్నాను నిస్వార్ధంగా !
నేడు హక్కుగా తీసుకునే ప్రతిది ,
     రేపటి జ్ఞాపకంగ మిగుల్చుకు నేందుకే !
" నాది " అంటే ఏదో ఒక రోజు
      " నా నుంచి దురామైపోయేది " అని అర్ధం !
అందుకే, నాది అనే దేది నాకు వద్దు !! 

                                         - అను మిట్టసల.
 
    
 
 
Read more ...

నేను...

Tuesday, 20 March 2012
                        నేను...            


భూమి - ఆకాశం మధ్య " నేను "
పుట్టుక -చావు మధ్య " నేను "
వివేకం - విజ్ఞానం మధ్య " నేను "
గెలుపు - ఓటమి మధ్య " నేను "
స్నేహం - తిరస్కారం మధ్య " నేను "
ఆలోచన - అనుభవం మధ్య " నేను "
ప్రేమ - అభిమానం మధ్య " నేను "
దుఖ్ఖం - సంతోషం మధ్య " నేను "
ఆవేశం - సహానం మధ్య " నేను "
అసహ్యం - ఆదరణ మధ్య " నేను "
కల - నిజం మధ్య " నేను "
ఆశ - నిరాశల మధ్య " నేను "
                గమ్యం లేని పయనంలో విసిగిపోయి,అలసిపోయి,నలిగిపోయాను.నాకంటు ఒక విలువ లేకపోయిన,మీతొనె పయనిస్తున్నాను .
నేను ఎవరో కాదు - " నీ మనస్సును " !

                                      - అను మిట్టసల.
Read more ...

హృదయ స్పందన..!

Monday, 19 March 2012
                            హృదయ స్పందన..!

మాటలు నేర్చిన హృదయం - నేను నిన్ను ప్రేమించాను?
                                                       అంటుంది !
ప్రేమించిన హృదయం - నా మనస్సు నీకు తెలియదా?
                                                       అంటుంది !
పరవశించిన హృదయం - నాలోనే నువ్వునావు?
                                                       అంటుంది !
నమ్మిన హృదయం - నేను ఏది దాచలేను నీ దగ్గర?
                                                       అంటుంది !
సంతోషంలోని హృదయం - నీ కోసం ఏదైనా చేస్తా?
                                                       అంటుంది !
దుఖ్ఖంలోని హృదయం - నా ఓదార్పు నువ్వు?
                                                       అంటుంది !
బాధలోని హృదయం - ఇంతేనా నన్ను అర్ధం చేసుకుంది?
                                                       అంటుంది !
భయంలోని హృదయం - నా ధైర్యానివి నువ్వు?
                                                       అంటుంది !
కోపంలోని హృదయం - అన్ని చెప్తే ఇంక నువ్వు ఎందుకు నాకు?
                                                       అంటుంది !
ఆవేసంలోని  హృదయం - 'నువ్వు- నేను' వేరు?
                                                       అంటుంది !
దిగులులోని హృదయం - ఎందుకింత మౌనం?
                                                       అంటుంది !
శాంతించిన హృదయం - 'నీ సంతోషమే - నా సంతోషం'?
                                                       అంటుంది ! 
ఇలా,సందర్భానికి తగట్టు "హృదయం" పలికే స,రి,గ,మ లే 
                                   ఈ స్పందనలు !!
చివరిగ,హృదయం అంటుంది - 'నా ఊపిరివి నువ్వు'...అని !!!

                                                  - అను మిట్టసల.
Read more ...

ఆశతో,ఆశగా..!

Monday, 19 March 2012
                              ఆశతో,ఆశగా..!


          మాట్లాడితే ముత్యాలు రాలున..
          నవ్వితే రత్నాలు మేరియునా...
          నీ కను సైగతో నిలిమేఘాని రాప్పిస్తావు...
          ఆ నిలిమేఘాలకు పురివిప్పే నెమలిని నేకానా !
          నీ చిరు కోపం చల్లారడానికి  చిరుగాలిని నేకానా !
          నీ మౌనభంగం  కావటానికి అక్షరాల హారం నేకానా !
          నీ స్పర్శకు కలువ విరబూయునే,ఆ కలువ నేకానా !
          నిన్ను ప్రేమించానని నా మనస్సు నీ మనస్సుకు చెప్పింది !
          కాని,నేనే నీకు చెప్పలేక పోతున్నాను !
          పొద్దులా నువ్వు, ప్రొద్దుతిరుగుడు పువ్వులా నేను !
          నీ దృష్టి అందరిని తాకింది, నన్ను తప్ప,తప్పు నాదా!
          చిలుక గోరువంక అసూయపడే జంట మనది కాగలదా ?
          ఆశతో,ఆశగా ఎదురు చూస్తున్నాను !! 
  
                                                       - అను మిట్టసల.


 

Read more ...

వెళ్లిపోతున్నావా...నేస్తం.

Saturday, 17 March 2012
                                        వెళ్లిపోతున్నావా...నేస్తం. 

      స్నేహం అనే నా ప్రపంచాన్ని ఏలిన ఓ మిత్రమా!
     విజియోత్సహంతో మరో దేశాన్ని పాలించాలని వెళ్ళిపోతున్నావా?
     రాజులు పోయినా,రాజ్యాలు పోయినా, 
                               బంధాలు పోయినా,బంధుత్వాలు పోయినా...
     ఈనా స్నేహబంధం ఎప్పట్టికీ నీరాక కోసం ఎదురు చూస్తుంది!
     సంతోషంలో ఈనా స్నేహాన్ని మరచినా....
     నీ బాధను,దుఖ్ఖాన్ని పంచుకునేందుకు నేనెప్పుడు వెనుకాడను !
     నేను బాధపడ కూడదని నువ్వు,నువ్వు బాధపడ కూడదని నేను,
     ఎక్కడ సముద్రానికి ఇరువైపులౌతామోనని భయం !
     ఎక్కడున్నా,ఏంచేస్తున్న,నువ్వు సంతోషంగా ఉండాలనే,
     నా ఆశ,తపన,నా చివరి కోరిక కూడా...!  


                                                                             - అను మిట్టసల.
Read more ...

ప్రేమ ఎంత మధురం..!

Saturday, 17 March 2012
                                ప్రేమ ఎంత మధురం..!             

            పైరు వీచె మౌనంగా...
           మేఘం వురిమె కోపంగా...
           వర్షం కురిసె మెల్లంగా...
           వెన్నెల విరిసే చల్లగా...
           కోయిల పలికే తియ్యగా...
           నెమలి నాట్యం చేసే హాయిగా...
           మల్లె విరిసే మృదువుగా...
           సెల ఏరు పారే గల గలా...
           ఇన్ని లక్షణాలు ఒక్క మనిషిలో,మనస్సులోనే వున్నవి.
           వర్షపు చినుకు నేలను తాకి పరవసిస్తే,
           నీ చూపు నా మనస్సుని తాకి పరవశించింది...!
           నీ మనస్సు నాకు తెలుసు,నాలో ఉన్నావు కాబట్టి..!
           నా మనస్సు నీకు తెలియదు,నీ మనస్సు నా దగ్గరుంది కాబట్టి...!

                                                             - అను మిట్టసల.
Read more ...

నువ్వు నాకు దక్కలేదు...!

Saturday, 17 March 2012
                                             నువ్వు నాకు దక్కలేదు...!

               నా దృష్టి నిన్ను తాకింది కాని,
                                              నువ్వు నాకు దక్కలేదు..!
               నిన్ను చూసి నా మనస్సు ప్రేమను కోరింది.కాని,
                                              నువ్వు నాకు దక్కలేదు..!
               నీ మౌనం నాతో,నా మనస్సుని మాయం చేసింది.కాని,
                                              నువ్వు నాకు దక్కలేదు..!
               నేను ఎదుట  పడినప్పుడు నీ తత్తరపాటు నచ్చింది.కాని,
                                              నువ్వు నాకు దక్కలేదు..!
               ఇన్ని జరిగినా నీ సమాదానం అందక,
                                             నేనే నీకు దూరమయ్యాను.
               ఎప్పటికి కలుసుకోలేని తీరంకు వెళ్ళాను...
                                                             వేరొకరితో...!
               ఇప్పుడు నువ్వు ఎదురైతె నావంతు "మౌనం" అయింది,
                                        ఎప్పటికి నువ్వు దక్కవని.....!      

                                                          - అను మిట్టసల.
   
Read more ...

ఒక్క సారి నన్ను చూడు...

Friday, 16 March 2012
                                            ఒక్క సారి నన్ను చూడు... 
                

 చూసి చూడనట్టు నిన్నే చూస్తున్నాను,నువ్వు చూస్తావని !
ఆరడుగుల ఆజాన బాహుడిని,అర చేతుల్లో దాచగలనా !   
వలపుల వల విసిరి పిడికిటైన గుండెల్లో బంధిస్తా !
మగజాతి మాణిక్యమా! ఒక్క సారి నన్ను చూడు !!

నిన్ను తప్ప మరిదేన్ని చూడటానికి ఇష్టపడని కళ్ళు !
చేజారి పోతాడేమో పట్టుకోమంటున్న చేతులు !
నా గమ్యాన్ని మారుస్తూ నీవైపే అడుగులు వేస్తున్న పాదాలు !
వేటగాడిలా వేచి చూస్తున్న మనస్సు !
ప్రేమ తరంగాలను ఉవ్వెత్తున  రేపుత్తున్న హృదయం !
ఇలా,పెకలించి ప్రేమను చెప్పని పెదవులను నిందిస్తున్నాయి !
మగజాతి మాణిక్యమా ! ఒక్క సారి ప్రేమించు !!

నీ ప్రయాణం వేరని తెలిసి...
కలత  చెందిన కళ్ళు కన్నీరు కారుస్తుంది !
మదన పడ్డ మనస్సు మౌనం వహిస్తుంది !
చిరూగాలై నిన్ను తాకనా,లేక సుడిగాలై నిన్ను ఎత్తుకుపోన !
చినుకై నిన్ను తడపనా,లేక వరదై నిన్ను మోసుకుపోన !
చలిమంటై నిన్ను కాయన,లేక పెనుమంటై నిన్ను ఆహ్వనించనా !
ఆశ నిరాశల మధ్య మనస్సు కొట్టుకుంటుంది !
మగజాతి మాణిక్యమా ! ఒక్క సారి నన్ను చూడు !!
  
                                                     - అను మిట్టసల. 
Read more ...

ప్రేమ దేవత ! ధన్యోస్మి !!

Sunday, 11 March 2012
                                   ప్రేమ దేవత ! ధన్యోస్మి !!
 
 నువ్వు ఎవరు సంపెంగ  మొగ్గవా లేక సిరిమల్లె పువ్వువా
నిన్ను చూసిన క్షణం,నా బాహువుల్లో బంధించాలి అనుకున్నా 
తెల్ల తామర పువ్వులాంటి నిన్ను ముట్టుకుంటే కందిపోతావేమో  అని 
అచేతనంగ  చూస్తూ ఉండిపోయాను !
బుద్ధిగ హద్దులు నేర్పిన ఓ ప్రేమ దేవత ! ధన్యోస్మి !!

అవి కురులు కావు ఇరులు 
విరజాజినై  నీ కురులలో ఊరేగాలి అనుకున్న కానీ,
వాడిపోతే దయ లేకుండా విసిరేస్తావేమో కదా !
అందుకే,విరజాజి నీ జడలో తురిమే అదృష్టం నాకు ఇవ్వు!
ప్రతి రోజు నా వలపుల తోటలో విరజాజులను పూయిస్తా!
సమయం వస్తే సమస్తం స్పంధిస్తుంది అన్న ఓ ప్రేమ దేవత !  ధన్యోస్మి !!

తమల పాకుల్లాంటి నీ పాదాలకు,
గొరింటాకునై  ఎర్రగా పూయనా లేక అందేనై మ్రోగనా
నచ్చక పొతే అమ్మో,నీ దరికి కూడా చేరనియ్యవు!
అందుకే,మెట్టేనై నే బ్రతికినంత కాలం నీ పాదాన్ని ఆక్రమించనా!
స్వప్నానికి మెలుకువ నిచ్చిన ఓ ప్రేమ దేవత !  ధన్యోస్మి !!

నీ పేరేంటో తెలియదు నాకు,అడగాలి 
నీపై గుండె నిండా ప్రేమను పెంచుకోగలిగాను కానీ,
మాట్లాడే ధైర్యాని తప్ప!
మౌనం మాటలను మింగేస్తు మూగవాడిని చేసింది! నిజం!!
అందుకే,నిన్ను ప్రేమ దేవత అని సంబొధిస్తున్నా!
ప్రియమైన నా చెలి ! ధన్యోస్మి !! 

                                                                             - అను మిట్టసల.
 

Read more ...

ప్రేమ...!

Friday, 9 March 2012

Read more ...