బంధాల కోసం బంగారు తల్లులు!
మనిషిని మనిషిగా చూడలేని ఈ రోజులలో బందాలు,బంధుత్వాల కోసం ప్రాకులాడుతున్న వారిని చూసి తప్పు ఎవరిదీ అని ఆలోచిస్తే నాకు ఇలా వ్రాయాలనిపించింది.ఒకప్పుడు ఒక బందం ఏర్పడితే దాని చుట్టూ ఉన్న ఎన్నో బంధుత్వాలకు,బంధువులకు విలువనిచ్చేవారు.బందాలకు,బంధుత్వాలకు,సాంప్రదాయాలకు ఎవరికీ వారు మనసా,వాచ,కర్మణ అలా కట్టుబడి ఉండేవారు.తరం అనే తరగతుల బడిలో ఎన్నో మార్పులు.మార్పు మంచికే కాని బంధాలను గుర్తుతెచ్చుకునే స్థితికి దిగజారిన మార్పును చూసి నాకు అసహ్యాం వేస్తుంది.
బిడ్డల కోసం తల్లిదండ్రులు పడుతున్న తపన,వాళ్ళ ఆరోగ్యం,చదువు,ఉద్యోగం ఇలా ఎన్నీటి కోసమో వాళ్ళ ఆకలి,కష్టం,సుఖం,సంతోషాన్నీ దారపోసి పెంచి పెద్ద చేస్తే ఎదిగిన బిడ్డ "నువ్వు ఎలా వున్నావు అమ్మ" అనే తీరిక లేదు.తన జీవిత లక్ష్యాల కోసం ఎంతో దూరం వెళ్లిపోతుంటే ఇంకెక్కడి బంధం,బంధుత్వం.
ఎప్పటికైన రారా అని కళ్ళలో ఎదురు చూపు,మనస్సులో చావని మమకారంతో ఆ తల్లి యుక్త వయస్సులోంచి వృద్ధాప్యానికి చేరింది.అలా ఎదురు చూస్తున్న తల్లికి ఏ బిడ్డ మారిన,ఈ కాలంలో మమకారం అనే దారంతో ప్రతి బంధాన్నీ ముడివేస్తూ,సంతోషాల హారాన్నీ అల్లగలరు.వృద్ధాప్యంలో ఎదురు చూస్తున్నఆ బంగారు తల్లికి ఏ బంగారు బిడ్డ ఆ హారాన్ని అందించగలడు!ఏం మీరు కాలేరా...రేపు ఇదే పరిస్తితి మనకు ఎదురైనప్పుడు ఎవరిని నిందించాలి?మనలనా,మన బిడ్డలనా ? తీరిక లేదని తీరం దాటే ముందు,ఒక్క నిమిషం లేదా ఒక్క సెకను ఆలోచించండి."వృద్ధాప్యం" అనే పసితనంలో ఉన్న ప్రతి తల్లికి,ప్రతి తండ్రికి మన ప్రేమ,ఆభిమానం,ఆప్యాయత,తోడూ,నీడ కావాలి.అధించాలని ఉంది కాని అందుబాటులో లేము అని అనుకోవద్దు.రేపు మన ఉనికిని గర్వంగా చాటుకోవాలంటే మొదలును కాపాడండి.ఇది నా మనవి !!
- అను మిట్టసల.
No comments:
Post a Comment