నిరీక్షణ...!
ఎప్పుడు మౌనంగా ఉండే నన్ను,నీ మాటలతో మాయ చేసావు !
నీ ప్రవర్తనతో నన్ను ఆకర్షించావు !
కల్మషం లేని నీ మనస్సు చూసి - నా మనస్సు కరిగిపోయింది !
ఎవ్వరితో మాట్లాడని నేను - నీ మంచితనంలో మాటలు నేర్చాను !
నీ నవ్వు చూస్తే - నా దుఖ్ఖం పోతుంది అన్నావు !
నీ మాటలు వింటే - నా బాధలు పోతాయి అన్నావు !
నా ధైర్యనివి నువ్వు అన్నావు !
నా సహనానివి నువ్వు అన్నావు !
దేవుడిచ్చిన వరం నువ్వు అన్నావు !
24c బంగారం నువ్వు అన్నావు !
నా ఓదార్పు నువ్వు అన్నావు !
ఈ ప్రపంచంలో నాకంటు ఉంది నువ్వు అన్నావు !
చివరికి,నా ఎదురుచూపు నువ్వు అన్నావు !
నేను మాట్లాడకపోతే తప్పించి పోయ్యవు !
నేను అలిగితే నిమిషానికి ఎన్ని బతిమాళులో !
ఇలా,మెల్లగా నా జీవితాన్ని నీకు కావలసినట్లు మార్చేశావు !
ఇప్పుడు ,నా పరిస్థితి ఎలా ఉందంటే...
నువ్వు మాట్లాడక పోయిన - నీ సంతోషం ముఖ్యం !
నువ్వు పట్టించుకోక పోయిన - నీ ఆనందం ముఖ్యం !
పరిస్థితులు నన్ను మార్చాయి అంటున్నా - నీ జీవితం ముఖ్యం !
నేను లేనిదే నీకు జీవితం లేదు అన్నావు...
అందుకే,జీవించాలని లేకున్న జీవిస్తున్నాను నీ కోసం !
అప్పటి నిన్ను ఇప్పటితో పోల్చుకుంటే...
నాకు సంతోషం లేక దుఖ్ఖం రావట్లేదు !
కారణం,నన్ను నాల ఉంచకుండ నిలా మార్చేశావు !
చందమామల కనుమరుగైన నువ్వు...
ఏదో ఒక రోజు వెన్నెల కురిపించవ...
అప్పుడు,నా నిరీక్షణ అనే మల్లెలు విరబూయక మానునా !!
- అను మిట్టసల.
Post your Valuable Comments which gives great Inspiration to Write Further More...