Pages

నువ్వు ఎక్కడ..!

Thursday, 5 April 2012
            నువ్వు ఎక్కడ..!

నా మాటలు ఇష్టపడిన మనస్సు ఎక్కడ !
నన్ను ఆరాధించిన మనిషి ఎక్కడ !
నా మనస్సులో మరణం అంటే భయం లేదు !
బ్రతుకంటే ఆశ లేదు !
నా నమ్మకానికి అన్నింటిని షేర్ చేసుకున్న అభిమానం ఎక్కడ !
ఇప్పుడు అనుభందానికి వెల కడుతున్న నువ్వు ఎక్కడ !
మనం కోల్పోతున్న విలువ ఇప్పుడు తెలియకపోవచ్చు !
జీవిత చక్రంలో తిరిగి మొదటి స్థానానికి రాక తప్పదు !
ప్రపంచంలో ప్రతి దానికి విలువ ఉంది .కాని,
మనిషికి,మనస్సుకు విలువ లేకుండా పోతుంది !
ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చాయి..
నీలో మార్పు రాదు అనుకున్నాను!
కానీ,ప్రపంచంలో నువ్వూ ఉన్నావని నాకు తెలిపేవు !
నీలోని మార్పు నన్ను దూరం చెయ్యటానికా ?
మనస్సును కోల్పోతే...జీవితాన్ని కోల్పోతావు !
మనిషిని కోల్పోతే...సర్వస్స్వాన్ని కోల్పోతావు !
మనస్సు విలువ తెలిస్తే నా మనస్సు నీకు అర్ధమౌతుంది !!

                              - అను మిట్టసల.

No comments:

Post a Comment