Pages

నా ప్రపంచంలో నువ్వు !!!

Saturday, 7 April 2012
         నా ప్రపంచంలో నువ్వు !!!


ప్రేమించటానికి చాలా దూరం ' నేను ' అని అనుకున్నా !
కాని,అందులో మొదటి వ్యక్తి నేనేనని నిన్ను కలిసాకే తెలుసుకున్నా !
నా ప్రపంచంలో ఎవరు లేరనుకున్న ' నీవు తప్ప' !
నీ రాకతో నా రాతను మార్చావు - సంతోషానికి హద్దులు లేవనుకున్నా !
నా కష్టానికి,దుఖ్ఖానికి విలువనిచ్చే నిన్ను చూసి - ఎంతో మురిసిపోయా ! 
నా కన్నీరు తుడిచే నీ చేతులు ఎల్లప్పుడూ నావనుకున్నా !
నా బాధ,ఒంటరితనాన్ని ఓదార్చే నీ మాటలు...
నాకు తోడుగా ఉండాలనుకున్నా !
ఈ ప్రపంచంలో ఎన్నో పరిచయం చేసిన నాకు,
నీవు జీవితాంతం నా బాగస్వామిగా ఉండాలనుకున్నా !
ఇలా ఎన్నో అర్ధం చేసుకున్న నీవు...
మన పెళ్లి విషయంలో నాతో ఏకిభవిస్తవనుకున్నా !
ఎన్ని అవమానాలు ఎదురైనా నీవు నా కోసం వస్తావని ఎదురు చూస్తున్నా!
నీవు లేవన్న నిజం పుడ్చలేక వెల్లిపోవాలనుకున్న!
చివరి కోరికగా...నీవు సంతోషంగా ఉండాలని,
నేను నీ మనస్సులో  ఓ పేజీగా కాలం చాలించాలనుకున్నా !
మనస్సులో వేరొకరికి చోటు ఇవ్వలేక 'నీ.....',అని ముగిస్తున్నా !! 

                                      - అను మిట్టసల.
    
 

No comments:

Post a Comment