Pages

గుప్పెడు నల్లపూసలు..!

Sunday, 8 April 2012
                       గుప్పెడు నల్లపూసలు..!

మనలాంటి వారే మన స్నేహితులు అంటారు !
నాలాంటి నిన్ను ఆ దేవుడు సృష్టించి నాకిచ్చాడు !
అందుకే,దేవుడన్న - నువ్వన్నా నాకు చాలా ఇష్టం !
నాకున్న అష్ట ఐస్వర్యలను నీకు పంచాను...
అవి ఏంటో తెలుసా....
           1  నా స్నేహం..!
           2  నా నవ్వు..!
           3  నా మాట..!
           4  నా సంతోషం..!
           5  నా బాధ..!
           6  నా దుఖ్ఖం..!
           7  నా అభిమానం...ఇంకా,
           8  నా అమితమైన ప్రేమ..!
ఇలా,మన బంధం విడధియ్యరాని బంధంగా మారాలంటే..
పంచ భూతాల సాక్షిగా నన్ను పెళ్ళాడి..!
గుప్పెడు నల్లపూసల్లొ నన్ను ముడివేస్తే..!
నా నూరేళ్ళ జీవితాన్ని నీకు రాసిస్తా !
అప్పుడు,నీ పేరిట ఐదు హక్కులు నా సొంతమౌతాయి !
అవి ఏంటో తెలుసా...
           1  నువ్వు నా సొంతం అనే నల్లపూసలు..!
           2  నేను నీ దాన్ని అనే పాపిట సింధూరం..!
           3  నీకై విరిసే మల్లెలు..!
           4  సంతోషాన్ని వ్యక్త పరిచే గాజులు..!
           5  మట్టిలో కలిసే వరకు ఉండే మెట్టెలు..!
' మనం ' అనే పదంతో కాలం చాలించాలనే నా కోరిక...
నా జీవితాన్ని నీతో ఆనందంగా గడపాలనే నా ఆశ...
మంచి స్నేహితులు - మంచి జీవిత భాగస్వాములౌతారు...!!   

                                             - అను మిట్టసల.

No comments:

Post a Comment