ఇదా జీవితం!!!
ఆవేశం మనిషి సహానాన్ని పరిక్షిస్తుంటే,
పరీక్షలో మార్కులు మనిషిలోని ఆవేశాన్ని పెంచుతుంది!
ఆవేదన ఆవేశాన్ని ఆపలేక,సహనం సాహసం చెయ్యలేఖ!
ఆశలు ఆవిరైపోతున్నాయి,ఇప్పటికి జీవితం ఇదా !!
కన్నీరు కావేరి అయినా తాగటానికి పనికొస్తుంది!
కాని,అది పనికిరాని సముద్రమై ప్రవహిస్తుంది!
ఏదో సాదించాలనే ఆశలను,మార్కుల కొరడా వాటిని మరిపిస్తుంది!
ఈ సమాజం ఇక ఎప్పటికి మారదా?ఇప్పటికి జీవితం ఇదా!!
కులం మనుషులకు వద్దు అని,మార్కులో పెట్టి పైకి ఎదగానియట్లేదు!
శ్రమపడి పట్టా చేతపట్టుకొని బ్రతుకుదెరువు కోసం పరిగెడితే మిగిలేది శూన్యం!
ఎదిగేవాడిని ఎదగనీయక అణచివేయుట న్యాయమా!
ఇది ఎదిగేవాదిపై ఎదిగినవాడు వేస్తున్న సమ్మెట పోటు.ఇప్పటికి జీవితం ఇదా !!
చివరకు ఏదో ఒక గమ్యం చేరబోయేసరికి,ఆకలికి ఆక్రోశం ఎక్కువై రక్తాన్ని ఆవిరిచేస్తుంది!
జీతం లేని జీవికి జీవితం అవసరమా అంటున్నాడు జీవుడు!
ఇది ఆవేశం కాదు! చేతగాని తనము కాదు! ఏమి చెయ్యలేనితనం!
ఇది మారదా! మార్పు కోరదా! ఇప్పటికి జీవితం ఇదా !!
- అను మిట్టసల.
No comments:
Post a Comment