Pages

ప్రేమించాను..!

Friday, 13 April 2012
               ప్రేమించాను..!

ఒకప్పుడు నీ ప్రపంచం 'నేనే' అన్నావు,
శరీరానికి తగిలే గాయాలు మానుతాయి...
నీవల్ల నా మనస్సుకు తగిలిన గాయం ఎప్పటికి మానుతుంది !
నువ్వు పంచిన సంతోషం ఏమైంది.
ప్రపంచంలో ఎవరు ప్రేమించలేనంతగ ప్రేమించాను!
ప్రేమను వ్యక్త పరచటంలో లోపం ఉందేమో కాని,
నా ప్రేమలో ఏ లోపం లేదు!
నాలో స్నేహాన్ని గుర్తించిన నీకు,నా ప్రేమ కనిపించలేదా!
నన్ను కలిసే ప్రతి సారి,నీ కళ్ళలో ఆనందం చూశాను...
మోహంలో చిరు నవ్వును చూశాను...
గుండె నిండా నాపై నీకున్న ప్రేమ చూశాను...
నాకేదో చెప్పాలనే మనస్సును నీ కళ్ళలో చూశాను...
అన్నింటిని నాతొ షేర్ చేసుకుంటే - నువ్వు నా దానివి అనుకున్నా !

                                           - అను మిట్టసల.





No comments:

Post a Comment