Pages

అమ్మ ఓ మేజిక్..!

Saturday, 14 April 2012
                         అమ్మ ఓ మేజిక్..!


బంగారు,బుజ్జి,చింటూ అని అమ్మ పిలిస్తే,
బుడి బుడి అడుగులతో అమ్మ చెంత చేరేవాళ్ళం !
వెన్నెల్లో గోరు ముద్దలు తినిపించే అమ్మ నాకే సొంతం !
కన్నీరు తుడిచే అమ్మ కొంగు ఓ మాయమంత్రం !
నా బాధను చిటికెలో మాయం చేసే శక్తే అమ్మ !
అమ్మ ఒడిలో నిద్రపోతే ఏ ఉలికిపాటు నన్ను తాకదనే ధైర్యం !
కోపంలో బుజ్జగింపు మా అమ్మ !
నాతొ ఆటలాడిన అమ్మ నా మొదటి నేస్తం !
నా కధల పుస్తకం అమ్మ !
లాలిపాటల కోయిలమ్మ అమ్మ !
ఆలకలో ఆకాశాన్ని సైతం తెచ్చివ్వగలిగే అమ్మ !
నా నవ్వుకు ప్రతి రూపం అమ్మ !
ఇలా అన్నింటిలో,నా చుట్టూ తిరిగే ప్రొదు తిరుగుడు పువ్వు మా అమ్మ !!


                                        - అను మిట్టసల.




No comments:

Post a Comment