Pages

రోడ్..!

Monday, 16 April 2012
                       రోడ్..! 


మన ప్రయాణానికి వీలుగా ఏర్పర్చుకున్నవే రోడ్స్ !
వాటిపై సజావుగా సాగిపోవటానికి పెట్టుకున్నవే రూల్స్ !
మనుషులను,వాహనాలను అదుపు చేయ్యటానికి...
ఫుట్ పాత్స్,డివైడర్స్,బ్రిడ్జిలు ఇలా ఎన్నింటినో ఏర్పర్చుకున్నాము !
ఉరుకుల పరుగుల జీవితాన్ని వేగవంతంగా తిసుకేల్లగలిగే వాహనాలు !
జాగ్రత్త లేని జీవితాలై వేగంతో పోటిపడుతూ...
ప్రాణాలు నెలపాలు చేస్తుంటే...
మీ రక్తాన్ని నేను జీర్ణించుకోలేను అంటుంది రోడ్ !!  

నిధ్రమైకంలో డ్రైవర్లు వాహనాలు నడుపుతుంటే !
వృద్ధులు,యువకులు,పసిపిల్లలు ఏం పాపం చేశారు !
మీ నిర్లక్ష్యానికి వారి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి...
రెప్పపాటులో జీవితం తలక్రిందులౌతుంది !
గమ్యం చేరటం అవసరం.కాని,వేగంతో పోటిపడటం తప్పు !
జీవితాలను సార్ధకం చేసుకోవాల్సిన యువత వెర్రి వేషాలకు బలైపోతుంటే !
మీ రక్తాన్ని నేను జీర్ణించుకోలేను అంటుంది రోడ్ !! 

మత్తులో తూలుతు వాహనం నడపటం నేరం !
అన్ని తెలిసి తమ ప్రాణాలతో పాటు,
ఇంకెవరినో పైలోకాలకు తోడుకోని పోతుంటే !
తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు...
పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు...
అవయవాలు కోల్పోయి జివచ్చేవంలా బ్రతుకుతున్న వ్యక్తులు !
మన నిర్లక్ష్యాన్ని నింధించుకోకుండా...
రోడ్ మా బిడ్డల ప్రాణాలు పొట్టన పెట్టుకుంది అని అంటుంటే !
మీ రక్తాన్ని నేను జీర్ణించుకోలేను అంటుంది రోడ్ !!       

                                                            - అను మిట్టసల. 

     

1 comment: