Pages

పాత కన్నాంబనే..!

Friday, 20 April 2012
            పాత కన్నాంబనే..!              

ప్రపంచాన్ని నాకు గిఫ్ట్ ఇచ్చిన...
నువ్వులేని ప్రపంచం నాకు అందంగా అనిపించట్లేదు...
నీ గొంతువింటే చాలు నువ్వు ఎలా ఉన్నావో చెప్పగలను...
నీ జీవితంలో నా స్థానం ఎవ్వరికి ఇవ్వవు అనుకున్నా...
మన మాటలకు సమయం సరిపొయ్యేది కాదు...
ఇప్పుడు మాటలే కరువైపోయ్యాయి...
ఒక్క రోజు సంతోషం నాకు కేటాయించలేవా ...
ప్రతి విషయానికి ఎన్నో కారణాలు ఉంటాయి...
అన్నింటిని అర్ధం చేసుకోవడంలో,ఆలసిపోతున్నాను...
ప్రేమ ఎంత గ్రుడ్డిదో ఇప్పుడు నాకర్దమౌతుంది...
ఎవ్వరిని మోసం చెయ్యలేక...
నన్ను నేను మోసగించుకుంటున్నా...
మొహం నిండా సంతోషం,మనస్సు నిండా దుఖ్ఖంతో బ్రతికేస్తున్నా...
ఈ ప్రపంచాన్ని వదిలించుకోవాలని ఉన్నా...
అన్ని నీతోనే షేర్ చేసుకుంటాను అన్నావు కదా...
ఏ క్షణం నీకు అవసరమో తెలియక...
గాలికి రెపరెపలాడే దీపంలా వేచి ఉన్నాను...
నువ్వన్నట్టు నేను పాత సిన్మా కన్నాంబనే !!

                                                             - అను మిట్టసల

Post your Valuable Comments which gives great Inspiration to Write Further More...   


   






 

1 comment: