Pages

నా స్థానం ఎక్కడ..!

Monday, 23 April 2012
                            నా స్థానం ఎక్కడ..!               
 

నిన్న ఉన్నట్టు నేడు ఎందుకు లేదు...
ఒక మనిషిపై నిన్న పెట్టుకున్న ప్రేమ,అభిమానం,నమ్మకం...
నేడు ఎందుకు లేదు... 
నిన్న అదే మనిషి,నేడు అదే మనిషి...
స్వచ్చమైన లక్షణాలు కలుషితమౌతుంటే...
చూస్తూ నేనుండగలనా...
అందరికి మంచి చేయ్యాలనే నేను...కాని,
నేను ఎప్పటికి ' నేను 'గానే ఉంటాను...ఇది నిజం !
ఇంత ప్రపంచంలో నా స్థానం ఎక్కడ ?
నేను ఎవరు ? ఎవరి కోసం ఈ సహనం ?
ఎందుకింత అభిమానం ?
నన్ను అర్ధం చేసుకునే వ్యక్తులు ఎప్పటికి ఉండరు...
ఇది నిజం ! నిజంగా నిజం ఇదే !! 

                                              - అను మిట్టసల.
 

No comments:

Post a Comment