Pages

కలలా పలకరిస్తా..!

Thursday, 26 April 2012
                          కలలా పలకరిస్తా..!


కలువల్లాంటి కనులకు కాటుక అందం...
కాటుక కళ్ళకు కల అందం...
నువ్వు నన్ను తలచుకుంటే... 
నిద్రనై నీ కనురెప్పల వాకిట వేచి ఉంటా...
ఎప్పుడు నువ్వు నిద్రిస్తావా అని...
నువ్వు నిద్రిస్తే...
నీ తలపుల తలుపు తెరుచుకుని...
కలలా పలకరిస్తా...
కలవర పరిచే కలలా  కాదు...
అరుదుగా వచ్చే అందమైన తీపి కలలా...

                                                - అను మిట్టసల.
 

No comments:

Post a Comment