Pages

నీకే అంకితం..!

Friday, 6 April 2012
            నీకే అంకితం..!


నా మనస్సు నిండా ప్రేమ ఉంది కాని,ఎలా తెలుపను !
నిన్ను చూస్తే చాలు జలపాతం ఉప్పొంగినట్లు,
నా మనస్సు ఉప్పొంగుతుంది !
ప్రేమించటానికి నాకు ఒక జీవితం సరిపోదు !
నా మౌనం అర్ధం చేసుకున్న నీకు నా ప్రేమ తెలియలేదా !
మంచుబింధువు మొగ్గను ముద్దాడితే - 'మోహం' !
ఆ స్పర్శకు వికసించి పరిమళాన్నీ వేదజల్లితే - ' ప్రేమ ' !
ప్రేమించటం సులువు కాని,దానిని నమ్మకంతో కాపాడుకోవటం కష్టం !
నాది గొప్ప ప్రేమ కాదు,కాని... 
నా జీవితంలో మరొకరికి స్థానం ఇవ్వలేనంత ప్రేమ నీ వల్ల నాకు కలిగింది !
నా మాట , మనస్సు ,జీవితం నేనున్నంత వరకు నీకే సొంతం !
జీవితాంతం నా జీవితం నీకే అంకితం !
ఇది బాధలో తీసుకున్న నిర్ణయం కాదు...
ప్రేమగా ప్రేమతో తీసుకున్న నిర్ణయం !
ఇది నిజం...ఇది శాశ్వతం...ప్రాణం పోయినా మాట మిద ఒట్టు !
ఎందుకంటే, " ప్రేమ వేల కట్టలేనిది - ప్రాణం కన్నా విలువైనది "..!!

                                    - అను మిట్టసల.


No comments:

Post a Comment