Pages

మెలుకువ లేని హృదయం!

Friday, 13 April 2012
              మెలుకువ లేని  హృదయం!


హాయిగ ఉన్న జీవితంలోకి అడగకుండానే ప్రవేసించావు !
నీ సంతోషాన్ని అందరికి పంచమన్నాను...
నీ బాధను నాకు పంచమన్నాను...
అందుకేనేమో,కేవలం బాధను నాకు మిగిల్చావు !
మెలుకువ లేని హృదయం నా సొంతం చేశావు !
సమర్ధవంతంగా అన్నింటిని పరిస్కరిస్తావనుకున్న కాని,
అర్ధం లేని ప్రశ్నగా నన్నే మిగులుస్తావని అనుకోలేదు !
ఒంటరి తనాన్ని నాకు బహుకరిస్తావనుకోలేదు !
పరిస్తితులను అదుపు చేయ్యలేని నిన్ను చూస్తుంటే...
నీపై జాలి కలుగుతుంది !
నువ్వు నువ్వుగా లేని నీ జీవితం...
జీవితమెనా లేక జీవించేస్తున్నవా...
నువ్వు మిగిల్చిన ప్రశ్నలకు నువ్వే సమాధానం వ్రాయాలి ! 

                                           - అను మిట్టసల.

No comments:

Post a Comment