మనస్సు..!
ఒక్క పలకరింపుతో పరిచేయం పెరుగుతుంది...
అభిప్రాయాలు కలిసినచోట స్నేహం చిగురిస్తుంది...
కపటం లేని మాటల వల్ల నమ్మకం కుదురుతుంది...
నమ్మకం ఉన్న చోట ప్రేమ విరభుస్తుంది...
మనవాళ్ళకు ఏమి జరగకూడదని జాగ్రత్తలు చెప్తాం...
ఏమి చెప్పకుండా వుంటే దిగులు మబ్బు కమ్ముతుంది...
మనల్ని పట్టించుకోకుండా ఉంటే బాధ కలుగుతుంది...
దూరం తట్టుకోలేని మనస్సు కన్నీరు పెట్టుకుంటుంది...
మనస్సు సున్నితంగా ఉంటుంది...
అందుకే, అన్నింటికీ స్పందిస్తుంది...
మనస్సు సంఘర్షణలో జరిగే ఎన్నో స్పర్సలకు నేనున్నానంటుంది...
తీపి - చేదు జ్ఞాపకాల మధ్య ఊగిసలాడుతుంది...
ఏమి చెయ్యలేని మనస్సు...!
- అను మిట్టసల.