ప్రేమ తరంగాలు..!
విషాదపు అంచులో నిలచిన నేను...
విషాదపు అంచులో నిలచిన నేను...
ఒక్కసారి వెనక్కి తిరిగి చుస్తే...
జంటగా నడచిన దారి...నువ్వు ఒంటరి అంది...
మనస్సు తెరలను చిల్చుకొని గతంలోకి తొంగి చుస్తే...
గుప్పెడు గుండెను తాకినా ఎన్నో ప్రేమ తరంగాలు...
మరో క్షణం ఏమౌతుందో తెలియని సంతోషం...
నా మనస్సు కొమ్మపై బంగారు పుష్పాలు పూయించావు...
మన కలయిక ఓ అద్భుతం...
మన స్నేహం ఓ వరం...
అందమైన క్షణాలు...
సుందరమైన రోజులు...
మధురమైన మాటలు...
తియ్యటి ప్రేమకు ప్రపంచం చేదుగా ఉంది...
రాజు-రాణిగా ప్రేమను ఏలిన క్షణాలు...
మళ్ళి కావాలంటుంది మనస్సు...
నువ్వు నాకే సొంతం అన్న మనస్సు...
ఒంటరితనం ఎంత కటినమైనదో అంటుంది...
ఆకాశం వైపు కనులు ఎత్తి చూస్తే...
నా దుఖ్ఖాని చూడలేని మేఘం వర్షించింది...
పచ్చని చెట్టు నాకు ప్రతిలా మోడుగా మిగిలింది...
నేలతల్లి బీటలువారి బోరుమంటుంది...
వెండి వెన్నెల,వేడిని వెదజల్లుతుంది...
రెక్కలు తెగిన పక్షి ఎగరనట్లు...
గాయాలపాలైన మనస్సును మోస్తుంటే...
ఆ రోజులు,మందులుగా మళ్ళి కావాలంటుంది మనస్సు...
నీ ప్రేమకు దూరమైనా నేను...
మరో అవకాశంలో నువ్వే కావాలంటుంది మనస్సు...
- అను మిట్టసల.
No comments:
Post a Comment