ఫీలింగ్ బార్డ్..!
అందమైన జీవితంలోకి...
అపురూపమైన కానుకలా వచ్చావు..!
ఆహ్వానం లేని చిరు జల్లులా..!
జాబిలీ వెన్నెలలా..!
వేకువ కిరణంలా..!
ఇంద్ర ధనుస్సులా..!
ఉరుముకి మొగ్గతొడిగి విరిసే లిల్లిలా..!
ప్రేమను అందరు ఒకేలాగా ఫీల్ అవుతారు..!
అందుకు నేనేమి మినహాయింపు కాదు..!
శాస్వతమైన ప్రేమ నాకు దక్కింది..!
దేవుడు మొదటి పేజి వ్రాయక ముందే...
నువ్వు చివరి పేజి వ్రాశావు..!
ఇదే తలరాత అంటే..!
దేవుడు ఆడే ఆటలకు...శిక్ష ఎవరికీ ?
మనస్సు పక్షి రెక్కలు తెగి విలపిస్తుంటే..!
నా మనస్సును కభళింఛిన నీ ప్రేమకు,
నీ స్థానాన్ని ఇంకెవరికి ఇవ్వలేను కనుక...
నీ దానిగా మిగిలిపోవటం నాకెంతో సంతోషం...!
- అను మిట్టసల.
No comments:
Post a Comment