అంతరిస్తున్న పిచ్చుకమ్మ..!
పంచలకు వేలాడదీసిన వరి పన్నాలకై...
మా వాకిళ్ళు చేరే పిచ్చుకమ్మ,
నిన్ను చూడాలి ఒక్కసారి రావమ్మ!!
నీ కిలకిల రావాలతో,బుజ్జి బుజ్జి గంతులతో...
మా చెట్లపై వాలే
పిచ్చుకమ్మ,
నిన్ను చూడాలి ఒక్కసారి రావమ్మ!!
ఒకప్పుడు,ప్రతి ఇంట గుంపులుగా చేరి...
మా మనస్సు దోచిన పిచ్చుకమ్మ,
నిన్ను చూడాలి ఒక్కసారి రావమ్మ!!
మా సెల్ కబుర్లకు...
రేడియెషన్ వలలో కనుమరుగౌతున్న పిచ్చుకమ్మ,
నిన్ను చూడాలి ఒక్కసారి రావమ్మ!!
వేదనతో ముగా కన్నీరు కారుస్తూ...
మీ ప్రాణాలు బలిస్తున్న పిచ్చుకమ్మ,
నిన్ను చూడాలి ఒక్కసారి రావమ్మ!!
మాకు తెలిసిన పక్షి జాతుల్లో ఒకరైన మీరు,
మా పిల్లలకు ఫోటోల్లో కనబడుతున్న పిచ్చుకమ్మ,
నిన్ను చూడాలి ఒక్కసారి రావమ్మ!!
మిమ్మల్ని కాపాడటం మా చేతుల్లో లేదనుకుంటే...
ఇంకొద్ది రోజుల్లో మా బ్రతుకు ఇంతేలే...పిచ్చుకమ్మ,
మమ్మల్ని క్షమించి... ఒక్కసారి రావమ్మ!!
- అను మిట్టసల.
No comments:
Post a Comment