Pages

మా పల్లెటూరు..!

Friday, 11 May 2012
                               మా పల్లెటూరు..!



దేవుడి సృష్టిలో అందమైన ప్రదేశం మా పల్లెటూరు...
కాలుష్యం లేని ఊరు మా పల్లెటూరు...
ప్రతి ఇంటిని మేల్కొల్పే కోడి పుంజులు...
ప్రతి ఇంట పచ్చని కల్లేపి వాకిళ్ళు...
సాక్షాత్తు లక్ష్మిదేవిని బంధించే రంగు రంగుల ముగ్గులు...
బృందావనం తలపించే పెరటి పూదోటలు...
పురాతనమైన ఆలయం...
సెలయేటి ఒడ్డున బారుగా నాటిన చింత చెట్లు...
గోపురాల అందాలను నీళ్ళపై చూపుతున్న చెరువు...
ఎరుపు - తెలుపు కలయికలో విరభూస్తున్న కలువలు...
తామరాకుపై విహరించే రొయ్య పిల్లలు...
వేకువనే కావడిపై నీళ్ళు మోసుకెళ్ళే అన్నతమ్ములు...
తివాచిలు పరిచినట్లుండె పచ్చని పొలాలు...
ఏపుగా ఎదిగిన జొన్న కంకులు...
పసుపుగా నేలను సొంతం చేసుకున్న ఆవాలు మొక్కలు...
మాకు ఎదురు ఎవరు అన్నట్టు పొగాకు తోటలు...
ప్రతి పూట మ్రోగే రోకళ్ళ చప్పుడు...
పక్షుల కిలకిల రావాలకు నీడనిచ్చే గుబ్బ చెట్లు...
పిల్లలు ఆటలాడే మైదానాలు...
పెద్దలు ముచ్చటించే రచ్చబండలు...
రేడియో రూమ్ ముందు కూర్చునే మనుషులు...
నులక మంచాలపై ఆరు భయట సేదతీరే మామ్మలు...
ఏదో ఒక చుట్టరికంతో పెనవేసుకున్న బంధుత్వం...
సెలవుల్లో మట్టి పనులకు వెళ్ళే గ్రాడ్యుయేట్లు...
చాలి చాలని వసతులలో మేదావులైన విద్యార్ధులు...
మేతకు మందలుగా వెళ్ళే ఆవులు...
ఎంతటి దురానికైన సై అనే గుర్రపు బళ్ళు...
లంతారు  వెలుగుల్లో కనిపించే చిన్న అంగళ్లు...
పండుగులకు ఇంటింటా తిరిగే హరిదాసులు...
అమ్మగారికి దండం పెట్టు అనే గంగిరెద్దుల వాళ్ళు...
సేకునాలు చెప్పే చెంచులు...
నువ్వు శ్యామలా కుతురువా అని గుర్తుపట్టే ఊరివాళ్ళు...
మీ మేనమామ మా టిచర్ అనే అమ్మ స్నేహితులు...
ఇలా  చెప్పుకుంటూపొతే,వర్ణించటానికి కరువైన పదాలు...
కాలగర్బంలో కలిసిపోతున్న పల్లెటూరి అందాలకు...
నా ఊరు పల్లెటూరు అని గర్వంగా చెప్పే నా మనస్సు...
ఇప్పుడు,పల్లె కన్నీరు కారుస్తుంటే...పట్నం వెక్కిరిస్తుంది...
నా ఊరు పల్లెటూరు అని గర్వంగా చెప్తుంది మనస్సు...

                                                         - అను మిట్టసల.

                                                                                              



 


No comments:

Post a Comment