Pages

మనం..!

Sunday, 13 May 2012
                                              మనం..!

         ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన స్థానాలు తల్లితండ్రులు,గురువు,స్నేహితులు,దైవం.అందుకే,వీళ్ళ గురించి వ్రాయాలి అనుకుంటున్నాను.
                                                 సృష్టికి మూలం తల్లితండ్రులు...వీళ్ళ 
ప్రతిబింబాలె మనం.మన ఉనికికి కారణ మూర్తులను అపురూపంగా చూసుకోవలసిన  భాద్యత మనది.మారుతున్న ప్రపంచంతో పోటిపడినప్పుడే  మనం ఏమి సాధించగలమో సమాజానికి తెలుస్తుంది.మార్పు మన ఉనికిలో 
రావాలి కాని మనలో కాదు.ఏ స్థాయికి ఎదిగిన,ఒదిగి ఉండాలి అన్నట్టు.మనం ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా  తల్లితండ్రుల ప్రేమానురాగాలను వదులుకోకూడదు.పసిపాపల నుంచి గొప్ప 
 వాళ్ళమైయ్యే వరకు వాళ్ళ కష్టసుఖాలను పట్టించు కోకుండా మనమే వాళ్ళ జీవితంగా శ్రమించిన తల్లితండ్రులను,వృధాప్యంలో వదిలెయ్యటం సమంజసమా? రేపు మన ప్రతిబింబాలు మనల్ని కూడా ఇలాగే చూస్తారేమో? ఒక్కసారి మన ప్రస్థానం ఎక్కడ నుంచి ఎలా మొదలైందో   ఆలోచించండి.
  విధ్యా  బుద్ధులు నేర్పిన గురువులకు ఏమిచ్చి మనం ఋణం తిర్చుకోగలం.ప్రతి విధ్యార్దిని గొప్ప స్థాయిలో చూడాలని గురువు ఏంతో శ్రమిస్తాడు.రెక్కలోచ్చిన మనం ఎగిరిపోతున్నాము విదేశాలకు.సంపాదనలో పడి మానవతా విలువలు కోల్పోతున్నాము.ఇది మన సాంప్రదాయం కాదు...
        మన మంచి చెడులను ఓపెన్గా షేర్ చేసుకునే వ్యక్తులు మన స్నేహితులు...మన జీవితంలో ఏంతో ముఖ్యమైన వాళ్ళు ఎందుకంటే,మనల్ని గైడ్  చేసేది వీళ్ళే.మనలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళే మన స్నేహితులౌతారు అందుకే అంత ఫ్రీగా అన్నింటిని పంచుకుంటాము .ప్రతి మనిషిలో మంచి,చెడులు ఉంటాయి..మనకి కావలసిన మంచిని వాళ్ళ దగ్గర్నుంచి తీసుకోవటం స్నేహం కాదు.వాళ్ళ చెడును సరిదిద్ది మంచిగా మలిచే శిల్పులం కావాలి.మంచి చేస్తే బుజం తట్టాలి,తప్పు చేస్తే క్షమించాలి తప్ప వదిలెయ్య కూడదు.మనలాంటి మరో వ్యక్తే మన స్నేహితులు...
        సర్వమత సమ్మేళనమే మన దేశం.మన మనస్సులో జరిగే మంచి చెడుల సంఘర్షణే  దైవం అంటాను నేను...మన మనస్సాక్షిని మించిన దైవం ఉందా..!ఎవరి అభిప్రాయం వాళ్ళది.అందరి దేవుళ్ళ సారంశము: ప్రేమగా ఉంటూ మంచిని పెంచటమే.మనల్ని సరైన మార్గంలో నడిపే సాక్షే దైవం...
     మనం మనుషులం అలాగే ఉండాలి...మన మనుగడకు కారణ భుతులైన తల్లితండ్రులను,గురువులను,స్నేహితులను,ధైవాన్ని ఎప్పట్టికి మరచిపోకూడదు..ఇది కేవలం నా మనస్సులో ఎప్పుడు మెదిలే ఆలోచనే ఈ "మనం" అభిప్రాయం... 

                                                                        - అను మిట్టసల.

  
  
        
 
 

No comments:

Post a Comment