Pages

నువ్వే గుర్తొస్తావు..!

Monday, 14 May 2012
                     నువ్వే గుర్తొస్తావు..!


తిలకం చూస్తే - విశాలమైన నీ నుదురు గుర్తొస్తుంది...
కాటుక చూస్తే - ఆల్చిప్పలాంటి నీ కళ్ళు గుర్తొస్తాయి...
ముక్కెర చూస్తే - సంపెంగాలాంటి నీ ముక్కు గుర్తొస్తుంది...
ఎర్రని గులాబిని చూస్తే - అందమైన నీ పెదవులు గుర్తొస్తాయి...
దానిమ్మ గింజలు చూస్తే - చిక్కని నీ పలువరస గుర్తొస్తుంది...
బుట్ట కమ్మలు చూస్తే - ముచ్చటైన నీ చెవులు గుర్తొస్తాయి...
మల్లెలు చూస్తే  - నల్ల త్రాచులాంటి నీ జడ గుర్తొస్తుంది...
బంగారు కంటే చూస్తే - శంఖంలాంటి నీ మెడ గుర్తొస్తుంది...
గాజులు చూస్తే - సుకుమారమైన నీ చేతులు గుర్తొస్తాయి...
వడ్డానం చూస్తే - వయ్యారంగా కదిలే నీ నడుము గుర్తొస్తుంది...
పట్టిలు చూస్తే - కోమలంగా ఉండే నీ పాదాలు గుర్తొస్తాయి...
ఆరు గజాల చీర చూస్తే - అందానికి అడ్రస్ అయిన నువ్వు గుర్తొస్తావు...
అద్దంలో చూస్తే - నా బదులు,నువ్వే కనిపిస్తావు...
పదే పదే  నువ్వు గుర్తొస్తుంటే...
నా మనస్సంటుంది - నీలో నన్నుండనిస్తే చాలు...

                                                             -  అను మిట్టసల.









No comments:

Post a Comment