Pages

డైరీ..!

Saturday, 2 June 2012
డైరీ..!


మాటల్లో చేప్పలేని ఎన్నో సంగతులను తన కడుపులో నింపుకుంటుంది డైరీ...
జ్ఞాపకాల సంపుటి డైరీ...
డైరీలో పొందుపరిచిన సంతోషం ఎప్పటికి చెరగదు...
మనస్సు పంచిన దుఖ్ఖం ఎప్పటికి తరగనివ్వదు డైరీ...
సంతోషాన్ని- దుఖ్ఖని సమానంగా ఆదరించే నేస్తం డైరీ...
ప్రతి విషయాన్నీ నిర్బయంగా షేర్ చేసుకోగలిగేదే డైరీ...
మన హావభావాలను అలాగే ద్రపరుస్తుంది డైరీ...
అందరికి అన్ని విషయాలు సూటిగా చెప్పలేము,ఒక్క డైరీతో తప్ప...
గుండేలోతుల్లో బంధీలుగా ఉన్నా ఎన్నో ఊసులకు సరైన ఓదార్పు డైరీ...
ఎదుటివారు అర్ధం చేసుకోవట్లేదు అనుకునేకన్న...
మనల్ని మనలాగే అర్ధం చేసుకున్నే డైరీ ఓ వరం,ఎందుకంటే...
ప్రతి స్పర్శకు ఒక విలువైన అర్ధం ఎప్పటికి డైరీలో దాచగలం...
మానవ లక్షణం మార్పు,మరుపు,కాని...
ఈ రెండు లక్షణాలను డైరీకి అవసరం లేదు...
మనిషి మనస్సును తనలో ద్రంగా దాచుకొంటుంది డైరీ...
సంగతులకు ఎప్పటికి చెరగని చిరునామాగా నిలుస్తుంది డైరీ...
జీవితంలో మన రాత కోసం ఎదురు చూసేది డైరీ...
మనస్సు పగిలి కారేకన్నిరుని అక్షరాలుగా అక్కున చేర్చుకుంటుంది డైరీ...
కరిగిపోయ్యే కాలాన్ని సైతం తన గుపిట్లో బంధిస్తుంది డైరీ... 
మన భవిష్యత్తుకు దిక్సూచి ఈ డైరీ...
అందుకే, మనిషి జీవితంలో అందరు వ్రాయల్సిందే డైరీ...

                                                                                                                 
                                            
                                                         - అను మిట్టసల.


No comments:

Post a Comment