Pages

మౌనం..!

Friday, 15 June 2012
                              మౌనం..!


మౌనం హృదయం పలికే అందమైన భాష...
లిపిలేని భాష మౌనం...
కవులకు అందని భాష మౌనం...
ప్రేమను వ్యక్త పరచలేని హృదయం మౌనం వహిస్తుంది...
గుండె నిండా ఉన్న ఎన్నో మాటలను మౌనం బంధిస్తుంది...
బాధను సైతం మౌనం గుప్పెట్లో  అపురూపంగా దాచుకుంటుంది...
మనస్సు ఎన్నో సార్లు మౌనంతో పోరాడుతుంది మాటలకోసం...
అన్ని సందర్భాలో మాటలు పనికిరావు,మౌనం తప్ప...
మౌనం ప్రతి ఒక్కరి మనస్సుతో ఆటలాడుతుంది...
కళ్ళకు తీపి కల ఎంత అందమో,...
మనస్సుకు మౌనం అంతే అందం...
వర్షపు చినుకు భూమిని తాకి పరవసిస్తుంది,...
అలాగే,మౌనం మనస్సుని తాకి పరవసిస్తుంది...
మౌనం అన్ని సందర్బాలపై విజయం సాధిస్తుంది...
ఎన్నో అనర్ధాలను తప్పిస్తుంది మౌనం...
మౌనం ఎంత ఉన్నతమైనదంటే,...
మనస్సును తన భానిసగా మారుస్తుంది...
మౌనం పాపాయి నవ్వుల ఉంటుంది...
అరవిచ్చిన గులాబిలా  ఉంటుంది...
ఆకాశంలో ఇంధ్ర-ధనుస్సులా ఉంటుంది...
నిమ్మళంగా ఉన్నా సముద్రంలా ఉంటుంది...
ఒక్క స్పర్శ బంధాన్ని తెలుపుతుంది...
అలాగే,మౌనం మనస్సును తెలుపుతుంది...
నా మనస్సును కమ్మేసిన మౌనం,...
మాటలను వెతుకుంటూ ఎటో వెళ్ళిపోయింది...
అందుకే, అందరికి అర్ధం కాదు మౌనం పలికే భాష...

                                                - అను మిట్టసల.
 
 

   

No comments:

Post a Comment