Pages

నీలో నేను..!

Sunday, 1 July 2012
                             నీలో నేను..!


వాలు కళ్ళు వాకిలి వైపే చూస్తున్నాయి...
నువ్వు నా చెంత చేరే సమయం కోసం...
నా ప్రేమ పరిమళాన్ని ప్రపంచానికి పరిచేయం చేస్తావని...
నువ్వుంటే ఈ ప్రపంచం అందంగా ఉంటుంది...

ఇంక,నువ్వు నా ఎదురుగ ఉంటే...
నీ మనస్సులో ప్రేమనౌనా...
నీ కళ్ళలో సంతోషం కానా...
నీ మాటల్లో పలుకుని కానా...
నీ బాహువుల్లో బంధిని కానా...

నువ్వు నాకు దూరంగా ఉంటే...
నీ మనస్సులో ఒంటరితనం కానా...
నీ కళ్ళలో శూన్యం కానా...
నీ మాటల్లో మౌనం కానా...
నీ వెంటే ఉండే నీడను కానా...

గొంతు దాటని మాటలను నీ మౌనం చేరేసింది నాకు...
నీ శ్వాసను నేనని...
నీ నాడిని నేనని...
నీ ఊపిరి నేనని...
నీ మనస్సుని నేనని...
నీ ప్రేమను నేనని...
నీ ప్రాణం నేనని...
ఇన్ని తెలిశాక నా మనసంటుంది - నా ప్రపంచం నువ్వని...

                                                               - అను మిట్టసల.
Read more ...