ప్రేమ లేఖ..!
ప్రియమైన నీకు...
ప్రియమైన నీకు...
కాలేజీ రోజుల్లో నా కళ్ళకు చదువు తప్ప మరేది కనిపించ లేదు.నిన్ను చూశాక అంతే,నువ్వు తప్ప ఇంకేది కనిపించట్లేదు.నేనంటే నీకు ఇష్టమో లేదో తెలియదు కాని,నేను నిన్ను ప్రేమించాను.ఎప్పుడు ప్రేమించానో తెలియదు,ఎందుకు ప్రేమించానో తెలియదు కాని నిస్వార్దంగా ప్రేమించాను.వాటంగా వీచే నీ ప్రేమ గాలికి దూదిపింజలాంటి నా మనస్సు నీ వెంటే పయనిస్తుంటే.తడి దాచుకుని వర్షించని మేఘంలా అలా చూస్తూ ఉండిపోయ్యాను...ఆపాలి అన్న ఆలోచన రాక కాదు...ఏనాటికైనా నీ చెంత చేరాలి కదా అని.
సృష్టిలో ప్రేమ తియ్యనైన పదం.ప్రేమించటం,ప్రేమించబడటం ఇవి రెండు ప్రేమ అనే నాణేనికి బొమ్మ-బోరుస్సుల్లాంటివి.ఏ ఒక్కటి లేకపోయినా రెండోదానికి విలువ లేదు.చెల్లని నాణెంలా మిగిలిపోతుంది.నాకే సొంతమౌవాలని ప్రేమించ లేదు కానీ నువ్వు ఎక్కడున్న సంతోషంగా ఉండాలనేంతగా ప్రేమించాను.నా ఆలోచనలో నీ రూపమే,నా మనస్సులో నీ ప్రతిరూపమే.సంతోషంలోను,బాధలోను నువ్వే గుర్తొస్తావు.ఎక్కడ చూసిన,ఎవర్ని చూసిన నువ్వే గుర్తొస్తావు.ఎందుకో తెలుసా...నా మనస్సును కబ్జా చేసిన నువ్వు నాలోనే ఉన్నావు కదా.
ఎన్నో చెప్పాలని ఉన్న "నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అన్న మాట ముందు ఇంకేవి గుర్తు రావట్లేదు.నువ్వు ఎక్కడ ఉన్న సంతోషమే నాకు.కాని,నాతొ నువ్వు ఉంటే వర్ణించటానికి పదాలు సరిపోవు...నువ్వు నాతో ఉంటావు అన్న అనుభూతి ఎలా ఉందంటే,ఆకాశం హరివిల్లుని బంధించినట్లు.....,మేఘం చందమామను కమ్మేసినట్లు.....,అర చేత్తుల్లో పడ్డ ఐసు ముక్కాలా.....నా మనసంతా నువైనప్పుడు నేను ఏమి చెప్పగలను.
ఇట్లు,
ప్రేమతో నేను...
- అను మీట్టసల.

No comments:
Post a Comment