పెళ్లి రోజు..!
ఎన్నో మంచి రోజుల్లో నా సొంతమైనది ఈ రోజు...
శ్రీరస్తు...శుభమస్తు...కళ్యాణమస్తు...ఆశీ ర్వచనాలతో
ఒక చక్కని శుభ ముహూర్తాన...
పచ్చని కళ్యాణ మండపంలో...
వేదమంత్రాలు పలుకుతున్న పండితుల నడుమ...
ఈ శుభఘడియ కోసం వేచి చూస్తున్న కుటుంబ సభ్యులు...
ఆనందంగా ఉన్న బంధు మిత్రుల సమక్షంలో...
శుభలేఖలు అందుకున్న అతిదుల సాక్షిగా...
దెదీప్యంగా వెలుగుతున్న దీపాలంకరణ మధ్యన...
పెళ్లి పీటలపై పట్టు వస్త్రాలలో నేను - తను
ఇరువురి చూపులను ఏకం చేసిన జిలకర్రబెల్లం
మేళతాళాలు మ్రోగంగా నేవేసిన మూడు ముళ్ళు
ఏడు జన్మల్లోను తను నీ సొంతం అంటున్న అక్షింతలు
పవిత్రమైన హొమం సాక్షిగా నడచిన ఏడడుగులు
పోటాపోటీగా పోసుకున్న తలంబ్రాలు
బిందెలో వేసిన ఉంగరం తెచ్చిన పరిక్ష
మృదువైన పాదాలకు తొడిగిన మెట్టెలు
అరుంధతి నక్షత్రాన్ని చూపించిన వైనం
ఇద్దరం ముగ్గురమైన - నిన్న మొన్న జరిగినట్టున్న నా పెళ్లి...
దేవుని ఆశిస్సులతో మా జీవితం నూరేళ్ళు సాగాలని ఆశతో...
అన్నటు మీకు చెప్పనే లేదు కదూ,
ఈ రోజే నా పెళ్లి రోజు...
- అను మిట్టసల.