Pages

అడవి మల్లెను నేను..!

Monday, 10 September 2012
                                                           అడవి మల్లెను నేను..!


అడివిలో కురిసే వెన్నెలకు...
విరిసే అడివి మల్లెను నేను...
స్వచ్చమైన తెలుపు నా మేనికి సొంతం...
అందమైన ఆకృతి నా అలంకారం...
మహారాజులు సైతం దాసోహం అనే పరిమళం నాది...
నేను విచ్చుకునె సమయం కోసం గాలి వేచిచూస్తుంది...
నా పరిమళాన్ని తనే మోసుకెళ్ళాలని...
నీ స్పర్శ లేక పున్నమి నాడైన విరబూయ గలనా...
ప్రతి సాయింత్రం నీ స్పర్శను ఆకాంక్షించె నేను...
ఏ రోజు ఎవరి చెంత ఉంటానో తెలియదు...
భక్తీ ఉన్న చోట దేవుడి చెంతనో...
ఆనందం ఉన్న చోట జడలోనో,మెడలోనో... 
దుఃఖం ఉన్న చోట పాడిపైనో,సమాధిపైనో...
ఇంత అపురూపమైన ప్రేమను కుమ్మరిస్తే,
శాశ్వతంగా ఉండాలనుంది...
అవసరం తీరాక వాడిపోయ్యానని వీధిన విసిరెస్తే...
ఒక్క క్షణం బాధ...అంతలోనే సంతోషం...
భక్తిని చాటాలన్న మేమే...
ప్రేమను తెలపాలన్న మేమే...
బాధను వ్యక్తపరచాలన్న మేమే...
మేము లేని మీ జీవితం లోటుగా ఉంటుంది.ఎందుకంటే,
మీ జివితమంత మాతోనే ఉంటుంది కదా...
అందుకే నేను,
మల్లెను..! అడవి మల్లెను.!! మీ అందరి మల్లెను..!!!

                                                                                                              - అను మిట్టసల.

No comments:

Post a Comment