Pages

బంధాలు..!

Thursday, 13 September 2012
                                                               బంధాలు..!
 

పుట్టుకతో దేవుడు ఇచ్చే బంధాలు కొన్ని...
ఇష్టంతో కలుపుకునే బంధాలు కొన్ని...
ప్రేమతో కట్టుబడే బంధాలు కొన్ని...
అవసరంతో కలిసే బంధాలు కొన్ని...
అనర్దాలకు దారి తీసే బంధాలు కొన్ని...
దుఃఖ్ఖాన్ని మిగిల్చే బంధాలు కొన్ని...
స్వార్దంతో దగ్గరయ్యే బంధాలు కొన్ని...
ఇర్షా ద్వేషాలతో రగిలే బంధాలు కొన్ని...
బంధాలను గౌరవించటం తెలిసినప్పుడు ఏ సమస్య రాదు...
మనం ఎన్నుకునే బంధాలు ప్రశ్నించే విధంగా ఉండ కూడదు...
బంధాలు బలంగాను,కళకళలాడుతు,నిండుగా ఉండాలి...
నాజుకుగా ఏర్పడే బంధం చిగురుటాకులా ఉంటుంది...
ప్రేమ ఉన్నపుడు బంధాన్ని శాసించలేము...
అలాగే,ద్వేషం ఉందని బంధాన్ని తెంచుకోలేము...
జాలరి వల విసరి చేపలు పట్టినట్లు...
దేవుడు ఏర్పరచిన ఇన్ని బంధాలలో...
ఇష్టం - ప్రేమతో మనకు కావలసిన శాశ్వత బంధాలను ఎంచుకోవాలి...
ఏది ఏమైనా,
బంధం ఎలా కలిసినా వాటిని నిలబెట్టుకోవాలి చివరి వరకు...

                                                                                                             - అను మిట్టసల.

No comments:

Post a Comment