Pages

నాలోని మనస్సు..!

Wednesday, 10 October 2012
                                      నాలోని మనస్సు..!



మనిషి శరీరానికి మరణం ఉన్నట్టు...
మనస్సుకు మరణం ఉంటే ఎంత బాగుంటుంది...
పదే పదే చావకుండ బ్రతికిపోతుంది...
వెలకట్టలేని మనస్సు నిరుపేదై...
భవిష్యత్తే లేని ప్రశ్నగా మిగిలితే...
మనిషి శాసిస్తున్న దారిలో వెళ్ళలేక...
తనకు ఇష్టమైన గమ్యం చేరుకోలేక...
మంచి చెబితే చేతగానితనం అంటు...
ప్రేమ పంచితే అసమర్ధత అంటు...
నన్ను వేలివేస్తుంటే...
అనుబంధాలను వదిలేసుకోలేక...
తప్పున్న - లేకున్నా అన్నింటికీ సమాదానపడుతూ...
వేధన ,బాధ నాలో దాచుకున్న ఒంటరిని...
నాలుగు రోజులు సంతోషం నా చెలిమి చేస్తే...
ఈ జన్మకు నేనే నీకు తోడు అంటుంది,
ఓర్వలేని దుఃఖం నన్ను మిగేస్తూ...
అయిన,ఒక్క చిరు ఆశ నాకు ఊపిరి పోస్తుంది...
నాలాంటి మరో మనస్సు కలుస్తుంది అని...
మనిషిలో అనాధగా మిగిలిన నేను...
నావి అనేవి సొంతం చేసుకోవటం కోసం...
మరో ఉషోదయాన్ని ఆశిస్తూ...మరణిస్తా 
అంటుంది,నాలోని మనస్సు...


                                                                  - అను మిట్టసల. 


No comments:

Post a Comment