Pages

నీడ..!

Friday, 19 October 2012
                                                            నీడ..!              


ఒంటరి ప్రయాణంలో జంటైన నా నీడ...
తోడుగా వస్తుంది అనుకుంటే...
సూరీడు నడినెత్తి మీదకు వచ్చేసరికి ...
నీతో ఇక సాగలేను అంటూ వెళ్ళిపోయింది...
మల్లి నా ప్రయాణం ఒంటరిగా మిగిలింది...
ప్రొద్దు దిగే వేల,మళ్ళి నన్ను పలకరిస్తూ...
నాతొ నువ్వు సాటిరావు అన్నట్టు...
నాకన్నా ముందుగా వెళుతుంది...
తనపై మమకారం చావక...
నావెంట రాలేదని అలగక...
తనవెంట నేనే వెళ్ళుతున్న...
చేరాల్సిన తీరం మిగిలుండగానే...
అస్తమిస్తున్న సూర్యుడు నా నీడను తనలో కలుపుకుంటే...
దిగులు పడ్డ నన్ను దిటవు చేస్తూ...
వెళ్లొస్తాను అంటుంది నా నీడ...
నేనంటూ లేకపోతె ఎమౌతుందోనని...
నన్ను విడని నా నీడ కోసం...
సాగిస్తున్న ఈ నా ప్రయాణం ఒంటరిగా...


                                                          - అను మీట్టసల.



No comments:

Post a Comment