Pages

ఓ ప్రేమ..!

Friday, 26 October 2012
                                                           ఓ ప్రేమ..!



ఓ ప్రేమ ! నా ప్రేమ !!
నావైపు రాకు, నన్ను వదిలై అన్నాను
పంతంగా,నన్ను నీ బుట్టలో వేసుకున్నావు ...

నువ్వు పంచె సంతోషమైన,దుఃఖమైన నాకు వద్దు అన్నాను
మొండిగా,నాలోంచి వెళ్ళనన్నావు...

నీ ఆటలో నన్ను ముంచకు అన్నాను 
ధీమాగా,నేనుంట నీ వెంట అన్నావు...

ప్రేమ తిపిదనం, వెదజల్లె  చేదు అన్నాను 
గర్వంగా,రుచి చూసి చెప్పు అన్నావు...

నువ్వు నిమ్మలించిన సముద్రం అన్నాను 
సున్నితంగా,దిగి ఈత నేర్చుకో అన్నావు...

నన్ను పాతాళంలో పడదోస్తావు అన్నాను 
మూర్ఖంగా,స్వర్గం విలువ తెలుస్తుంది అన్నావు...

గెలుపు-ఓటమిల విలువ ప్రాణం అన్నాను 
పౌరుషంగా,గెలిచి నిలబడు అన్నావు...



                                           - అను మిట్టసల.

No comments:

Post a Comment