Pages

You Are The One..!

Thursday, 20 December 2012
                              You Are The One..!


You are the WORLD
      Where I found Myself...
You are the ONE
      Whom I loved the Most...
You are the GAME
      Which I use to Play...
You are the VICTORY
      Which I try to Win...
You are the FIRE
      Where I get Warm...
You are the AIR
      Which I Inhale...
You are the SMILE
      Which I don't want to Fade...
You are the HAPPINESS
      Where I want to Double It...
You are the PAIN
      Where I want to Share...
You are the SILENCE
      In which I want to Support...
You are the ANGER
      Where I found Love...
You are the LIFE
      In which I want to Live...
You are the DEATH
     Where I want to go Before You...
You are the HOPE
     Which I never Give Up...


                                                            
                                                                  - Anu Mittasala.


Read more ...

నే వేచి ఉంటా..!

Saturday, 15 December 2012

                              నే వేచి ఉంటా..!


వెన్నెలవై నువ్వు విరుస్తానంటే 
చీకటినై నే వేచి ఉంటా...

కిరణంలా నన్ను తాకుతానంటే 
వేకువలా నే వేచి ఉంటా...

వెచ్చగా నన్ను కమ్మేస్తానంటే 
శీతాకాలంలా నే వేచి ఉంటా...

చల్లగా నన్ను చుట్టేస్తానంటే 
వేసవిలా నే వేచి ఉంటా...

నీరులా నా దరికి వస్తే 
దాహానై నే వేచి ఉంటా...

వర్షంలా నువ్వు కురుస్తానంటే 
భుమిలా నే వేచి ఉంటా...

నావలా నువ్వు మారతానంటే 
తెరచాపలా నీ వెంట ఉంటా...

ఆల్చిప్పలా నువ్వు మారతానంటే 
ముత్యానై నే పొదిగి ఉంటా...

సూర్యుడిలా నువ్వు అస్తమిస్తానంటే 
ప్రోద్దులా నే వాలిపోతా...

గుడిలా నువ్వు ఉంటానంటే 
దీపానై నే వెలుగుతూ ఉంటా...


                               - అను మిట్టసల. 


Read more ...

Without You..!

Friday, 14 December 2012
                                                    Without You..!


When the world sinks into sleep
I will awake myself into you...
I don't want to leave this night alone
Because,I'm dip in your thoughts...
My sky won't shine without you
There is no smile on my lips
No spark in my eyes without you...
My dreams stand at you day & night
O dear! you are heaven in my heart
You are the senses of my life
And,Beat of my heart...
The moment I feel alone
My heart says ' I'm in You '
And when you come near to me
I feel like, one day you will be mine...
No one is as special as you
I can't imagine without you
Assure me, I'm always yours...
I love you & I don't want to miss you
Because, I'm mad of you...




                                                                    - Anu Mittasala.



Read more ...

కరివేపాకు వంటి జీవితం..!

Wednesday, 12 December 2012
                                  కరివేపాకు వంటి జీవితం..!


                జీవితంలో చాలా మంది ఎన్నో సార్లు ఒంటరిగా మిగిలిపోయ్యము అని అనుకుంటారు.కొంతమందిని తల్లితండ్రులు ఒంటరి వాళ్ళను చేస్తారు,ఇంకొందర్నీ ప్రేమించిన వాళ్ళు,మరి కొందర్ని అభిమానించిన వాళ్ళు .ఇలా జీవితంలో ఒంటరివాళ్ళగానో లేక మనల్ని పక్కన పెట్టేశారనో అనుకుంటూ ఉంటారు.మనం ఎవరో జీవితం నుంచి విసిరివేయబడలేదు.మనం మన జీవితంలోనే కరివేపాకుల్లా మిగిలిపోయ్యాము.ఎలా అంటే? మనిషి జీవితం ఎంత విలువైనదో అంతే రహస్యమైనది.ఎందుకంటే జివిలోంచి జీవుడు ఎప్పుడు? ఎలా? వెళ్ళిపోతాడో తెలియదు.దేహాన్ని వదిలి ఆత్మా పరమాత్మను చేరుకుంటుంది.మన జీవితమే ఎలా సమాప్తమౌతుందో తెలియని మనం,ఈ దేహం మిద అమితమైన ఆశతో,వాంఛలను అందిపుచ్చుకోవాలనే తపనతో నిత్యం పోరాడుతూ నిరాశ,నిస్సప్రుహాలతో జీవితం సాగిస్తూ ఉంటాము.వదిలి వేయటానికి ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి.అన్నింటిని సమర్దించలేము కాని కొన్నింటిని తప్పక అర్ధం చేసుకోవాలి.ఎవరికీ మంచి చెయ్యకపోయినా చెడు చెయ్యకూడదు  కదా.
              నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది: జీవితం చిన్నది కాదు చాలా పెద్దది అని.సరి చెయ్యాల్సినవి,సరి చేసుకోవలసినవి ఈ ప్రపంచంతో పాటు మనలోను చాలానే ఉన్నాయి. 
              మన బాధలకు,దుఃఖ్ఖాలకు మనమే కారణం తప్ప ఇంకెవరినో నిందించటం తప్పు కదా.జీవితమే శాశ్వతం కానప్పుడు తక్కినవి శాశ్వతంగా  ఉండాలి అనుకోవటం ఎంత వరకు కరక్టు.మన ప్రాణమే తన టైం రాగానే మనల్ని వదిలించుకుంటే ఇంక తోటి వ్యక్తులు ఎంత మాత్రులు.ఎవరి జీవితాలు వాళ్ళవి.కూర వండేటప్పుడే కరివేపాకు అవసరం తప్ప తినేటప్పుడు కాదు.అలాగే,ప్రాణం ఉన్నంత వరకే మనిషికి,మనస్సుకు విలువ, అది కాస్త వెళ్ళిపోతే రేపటికి రెండు అనుకుంటుంది సమాజం.అందుకే, కరివేపాకు వంటిది జీవితం అన్నాను.ఇది కేవలం నా అభిప్రాయం.


                                                                   - అను మిట్టసల.
Read more ...

కాలం మాయ..!

Friday, 7 December 2012
                                      కాలం మాయ..!



అలలు రేపే అలికిడికి ఉలిక్కిపడ్డ సంద్రంలా  
నువ్వు కలలో కనపడి వెళ్లిపోతుంటే 
ఉలిక్కిపాటున పట్టుకోలేకపోయ్యను
సూర్యుడు ఉదయిస్తూ నా కలని మింగేశాడు...
నేరం ఎవరిదీ? శిక్ష ఎవరికీ?
సాఫీగా సాగని కలదా ?
కలలో కూడా కలవలేని నాదా ?
సృష్టిని మేల్కొకొల్పిన సూర్యుడిదా ?
ప్రేమగా సాగిన పనులన్నీ,బాధ్యతగా మారితే 
పెరుగుతున్న దూరాన్ని చూస్తూ
ప్రతి రోజు మనస్సు రాజిపడుతుంది...
ఎవరో అన్నట్టు :
 " మనం మారలేదని,ఇతరులు మారకుండా ఉంటారా  "
జీవితమంత రాజి అయినప్పుడు
మనస్సు ఎపాటిది...
సంతోషంలో ఉపోంగిపోతుంది
దుఃఖ్ఖం వస్తే కృంగిపోతుంది 
త్రిశంఖు స్వర్గంలో ఊగిసలాడే ఆత్మలాంటిది, మనస్సు...
అందుకే,మనస్సు ఎప్పుడు మనిషి అదుపులో ఉండాలి 
చేజార్చుకుంటే చేతగానితనమని 
చేజారిపోతే తలరాత అని అంటుంది లోకం...
ఏం జరిగిన, తన పని తాను చేసుకుపోతుంది కాలం
కోల్పోయిన జీవితాన్ని కనుమరుగు చేస్తూ...

                                           - అను మిట్టసల.

Read more ...

Bird & a Boy..!

Monday, 3 December 2012
                                                        
                             Bird & a Boy..!



                           With an stretched wings of happiness I'm flying in the sky.Suddenly, I was caught by a stranger and my happiness drown into sorrow.He taken me to his home and plucked all feathers not to fly away then he gifted to his beloved son.With his son's affection and love I was much pampered.




                      After few months later,they got transfer to a city where there is no place to me.Father told to his son to leave the bird here itself so that it can fly away and live happily.My little master rejected his father's advice because he loves me so much...After few hours his father said that if we take the bird along with us means one day, surely it will become a meal to somebody.Instead of killing the bird, leave it and live it long forever...With a painful heart the boy compromised himself to let me free.




                     At last, the day has come to give farewell to me without knowing my feelings.In an unavoidable circumstances I stood near to them to say good bye.My little master taken me into his hands by kissing and said the last words is : " The moment I see the sky it always treasure me with the sound of your feathers happiness.Love you and Bye ". He kept me on the branch of a tree and they went on with their way...



                       Tears might flowing out of my eyes I sat on the branch of a tree with an unexpressed feelings to my little master that " I forgot, How to fly in the sky in his love and affection...". Due to my reason I don't want to feel my master sorry.So, I kept quite with a heart sick.But, I Love U and Miss U too Master...Good Bye...

                                                                            by,
                                                              - Anu Mittasala.
Read more ...