నీపై నా ప్రెమ..!
ఒక రోజు తుఫానులా ఎగసిన ప్రేమ
జీవితాన్ని 'ఏమైనా' చేస్తుందని తెలియక
వేకువన కురిసే మంచులా
ఆనందంగా ఆస్వాదించాను
అతి మధురం వెగటు అన్నట్టు
నా ప్రేమ చేదైపోయింది...
స్వార్ధం నిన్ను చేరుకోమంటుంది
నిస్వార్ధం నీ సంతోషం చూడమంటుంది
ఈ రెంటి నడుమ మనస్సు రాజి పడలేక
మరచిపోవాలనుకున్న ప్రేమ
అనుక్షణం మనస్సును గాయం చేస్తుంది
నీ కోసం వేచి చూసే ప్రతి ఘడియ
నాది కాదు అని తెలుసు...
బలవంతంగా మనస్సు దారి మళ్లిస్తుంటే
ప్రతి మలుపులో నిన్నే గుర్తు చేస్తుంది
ఈ క్షణం ఇలాగే నిలచిపోవాలని
నువిచ్చిన సంతోషం నాతోనే ఉండిపోవాలి
మరువలేని ప్రేమ,
మరణంలేని జ్ఞాపకంలా మిగులుతుంది
బాధలో ఒరిగిపోతూ...
సంతోషంలో కరిగిపోతూ...
ప్రతి జన్మలో నీపై నా ప్రేమ
దాచాలన్న దాగేనా... అంటుంది
- అను మిట్టసల.
No comments:
Post a Comment