నాతో... నువ్వు!
నిన్ను కలవనివ్వని కాలాన్ని,
కరిగిపోమ్మంటున్న...
నిన్ను చేరనివ్వని గమ్యాన్ని,
తరిగిపోమ్మంటున్న...
నిన్నే తలపించె ఆలోచనల్ని,
అలసిపోకంటున్న...
నువ్వు లేని కలల్లన్ని,
చేదిరిపోమ్మంటున్న...
నీతో ఉండే సంతోషాన్ని,
నిలిచిపోమ్మంటున్న...
నీపై రేగె కోపాన్ని,
చల్లారమ్మంటున్న...
నిన్నే బంధించిన హృదయాన్ని,
ఆగిపోకంటున్న...
నీతో ఉండే జీవితాన్ని,
సాగిపోమ్మంటున్న...
నిన్నే కోరే మనసుని,
వదులుకోకంటున్న...
నికై నిలచిన మనిషిని,
చేరుకోమ్మంటున్న...
చివరగా! నీపై నిలిపిన ప్రాణాన్ని,
పోనివ్వకంటున్న...
నువ్వు లేని ప్రపంచాన్ని,
మునిగిపోమ్మంటున్న...
- అను మిట్టసల.
No comments:
Post a Comment