మనస్సు పలికే..!
మనిషి మనుగడ కోసం రాజిపడ్డ ప్రతి సారి
మనస్సు అనాధగా మిగుల్తూనే ఉంది...
ముల్లును దాచుకున్న మనసు
అనుక్షణం సంతోషం పంచుతూనే ఉంది...
గద్ద వర్షించే మేఘాన్ని దాటి ఎగిరినట్టు
ఈ వేదనను దాటి వేల్లిపోవాలంటే...
చేరవలసిన తీరం దూరంగా జరిగిపోతుంది
దోసిట్లో నీరు నిలవదని తెలిసి
దాచాలనే ప్రయత్నంలో ఓడిపోయ్యాను...
నిశబ్దపు వాకిళ్ళలో హాయిగా పడుకోవాలనుంది
మరో ఉదయం చూడాలని లేదు...
మరో చీకటిని తాకాలని లేదు...
మరో లోకం కోరట్లేదు...
మరో గాయం తట్టుకోలేదు...
మరో అదృష్టం కావాలనుకోవట్లేదు...
ఏనాడు వినిపించని మనసు మాటలు...
ఒంటరిగా మిగిలిన ఏకాంతంతో చెప్తుంది...
ఇక సాగలేను నాకు విశ్రాంతి కావాలి అని...
మనిషికి నాతో పనిలేదు...
తన ప్రపంచంలోను స్థానం లేదు..!
-అను మిట్టసల.