ప్రేమ దేవత ! ధన్యోస్మి !!
నువ్వు ఎవరు సంపెంగ మొగ్గవా లేక సిరిమల్లె పువ్వువా
నిన్ను చూసిన క్షణం,నా బాహువుల్లో బంధించాలి అనుకున్నా
తెల్ల తామర పువ్వులాంటి నిన్ను ముట్టుకుంటే కందిపోతావేమో అని
అచేతనంగ చూస్తూ ఉండిపోయాను !
బుద్ధిగ హద్దులు నేర్పిన ఓ ప్రేమ దేవత ! ధన్యోస్మి !!
అవి కురులు కావు ఇరులు
విరజాజినై నీ కురులలో ఊరేగాలి అనుకున్న కానీ,
వాడిపోతే దయ లేకుండా విసిరేస్తావేమో కదా !
అందుకే,విరజాజి నీ జడలో తురిమే అదృష్టం నాకు ఇవ్వు!
ప్రతి రోజు నా వలపుల తోటలో విరజాజులను పూయిస్తా!
సమయం వస్తే సమస్తం స్పంధిస్తుంది అన్న ఓ ప్రేమ దేవత ! ధన్యోస్మి !!
తమల పాకుల్లాంటి నీ పాదాలకు,
గొరింటాకునై ఎర్రగా పూయనా లేక అందేనై మ్రోగనా
నచ్చక పొతే అమ్మో,నీ దరికి కూడా చేరనియ్యవు!
అందుకే,మెట్టేనై నే బ్రతికినంత కాలం నీ పాదాన్ని ఆక్రమించనా!
స్వప్నానికి మెలుకువ నిచ్చిన ఓ ప్రేమ దేవత ! ధన్యోస్మి !!
నీ పేరేంటో తెలియదు నాకు,అడగాలి
నీపై గుండె నిండా ప్రేమను పెంచుకోగలిగాను కానీ,
మాట్లాడే ధైర్యాని తప్ప!
మౌనం మాటలను మింగేస్తు మూగవాడిని చేసింది! నిజం!!
అందుకే,నిన్ను ప్రేమ దేవత అని సంబొధిస్తున్నా!
ప్రియమైన నా చెలి ! ధన్యోస్మి !!
- అను మిట్టసల.

No comments:
Post a Comment