Pages

మౌనం..!

Friday, 15 June 2012
                              మౌనం..!


మౌనం హృదయం పలికే అందమైన భాష...
లిపిలేని భాష మౌనం...
కవులకు అందని భాష మౌనం...
ప్రేమను వ్యక్త పరచలేని హృదయం మౌనం వహిస్తుంది...
గుండె నిండా ఉన్న ఎన్నో మాటలను మౌనం బంధిస్తుంది...
బాధను సైతం మౌనం గుప్పెట్లో  అపురూపంగా దాచుకుంటుంది...
మనస్సు ఎన్నో సార్లు మౌనంతో పోరాడుతుంది మాటలకోసం...
అన్ని సందర్భాలో మాటలు పనికిరావు,మౌనం తప్ప...
మౌనం ప్రతి ఒక్కరి మనస్సుతో ఆటలాడుతుంది...
కళ్ళకు తీపి కల ఎంత అందమో,...
మనస్సుకు మౌనం అంతే అందం...
వర్షపు చినుకు భూమిని తాకి పరవసిస్తుంది,...
అలాగే,మౌనం మనస్సుని తాకి పరవసిస్తుంది...
మౌనం అన్ని సందర్బాలపై విజయం సాధిస్తుంది...
ఎన్నో అనర్ధాలను తప్పిస్తుంది మౌనం...
మౌనం ఎంత ఉన్నతమైనదంటే,...
మనస్సును తన భానిసగా మారుస్తుంది...
మౌనం పాపాయి నవ్వుల ఉంటుంది...
అరవిచ్చిన గులాబిలా  ఉంటుంది...
ఆకాశంలో ఇంధ్ర-ధనుస్సులా ఉంటుంది...
నిమ్మళంగా ఉన్నా సముద్రంలా ఉంటుంది...
ఒక్క స్పర్శ బంధాన్ని తెలుపుతుంది...
అలాగే,మౌనం మనస్సును తెలుపుతుంది...
నా మనస్సును కమ్మేసిన మౌనం,...
మాటలను వెతుకుంటూ ఎటో వెళ్ళిపోయింది...
అందుకే, అందరికి అర్ధం కాదు మౌనం పలికే భాష...

                                                - అను మిట్టసల.
 
 

   
Read more ...

స్పర్శ..!

Tuesday, 5 June 2012


                         
                          స్పర్శ..!


స్పర్శ మాటలకు అందని అందమైన అనుభూతి...
ఉరుమికి మొగ్గ తోడగటం లిల్లి వంతు...
వెన్నెలకు విచ్చుకోవటం కలువ వంతు...
చల్ల గాలికి విరభూయటం మల్లె వంతు...
నీలిమేఘానికి పూరి విప్పటం నెమలి వంతు...
పువ్వును ముద్దాడటం తుమ్మెద వంతు...
ప్రోద్దు చుట్టు తిరగటం పొద్దుతిరుగుడు వంతు...
చేతి స్పర్శకు ముడుచుకోవటం టచ్-మీ-నాట్ వంతు...
సూర్యుడిని చుట్టడం భూమి వంతు...
వసంత కాలంలో తియ్యగా కూయడం కోయిల వంతు...
నీటిలో బ్రతకటం చేప వంతు...
తోలిప్రేమను తియ్యని జ్ఞాపకంలా మిగల్చడం మనస్సు వంతు...
ఎరుపెక్కిన చెక్కిలి సిగ్గు వంతు...
అమితమైన ప్రేమకు స్పందించటం చిరునవ్వు వంతు...
స్పర్శకు ఎన్నో అర్ధాలనిచ్చే మౌనం ఏంతో అందం...
ప్రతి చర్యకు అందమైన ‘అనుభవం’ ఒక స్పర్శ...  


                                       - అను మిట్టసల. 

Read more ...

నాన్న..!

Monday, 4 June 2012
                               నాన్న..!

ప్రేమకు ప్రతి రూపం నాన్న...
మానవత్వం ముర్తిభవించిన మహా మనిషి నాన్న...
కష్టసుఖ్ఖాల  నిలువుటద్ధం నాన్న...  
నా మొదటి రోల్ మోడల్ నాన్న...
నా చేతిని పట్టుకొని మార్గాన్ని నిర్దేసిస్తాడు నాన్న...
నాకన్నా ముందు నా అవసరాలు గ్రహిస్తాడు నాన్న...
నా దుఖ్ఖానికి ఆనకట్ట నాన్న... 
నా చిరునవ్వుకు చిరునామా నాన్న...
నా ఓటమికి విక్టరీ ఫైండర్  నాన్న... 
బాధ్యతలను సంతోషంగా నిర్వర్తిస్తాడు నాన్న...   
నన్ను ఉన్నత స్థాయిలో చూడాలని ఏంతో శ్రమిస్తాడు నాన్న...
ప్రపంచంలో వెలకట్టలేని బహుమతి నాన్న...


                                       - అను మిట్టసల.



Read more ...