Pages

ఓ ప్రియ సఖి..!

Wednesday, 29 August 2012
                                            ఓ  ప్రియ సఖి..!


పున్నమి వెన్నెల్లాంటి నిన్ను చూసి...
పరవళ్ళు తోక్కుతున్న నా మనస్సుని...
నేను ఆపగలనా...
ఓ ప్రియ సఖి ! ఒక్క సారి తిరిగి చూడు !!

నీలి కురులు  నీ నుదుటిని ముద్దాడుతుంటే...
వాటిని సవరించాలనే నా చేతులను...
నేను ఆపగలనా...
ఓ ప్రియ సఖి ! ఒక్క సారి తాకనివ్వు !!

ఎర్రటి పెదాలపై తేలియాడుతున్న నీ నవ్వుకి...
దాసోహం అంటున్న నా జన్మని...
నేను ఆపగాలనా...
ఓ ప్రియ సఖి ! నాకే సొంతం కావా !!

పూత రేకుల్లాంటి నీ పాదాలు నన్ను దాటేలుతుంటే...
సాయంగా వేల్తానంటున్న నా అడుగులను...
నేను ఆపగాలనా...
ఓ ప్రియ సఖి ! ఒక్క సారి ఆగు !!

అలలా అలా నువ్వు సాగిపోతుంటే...
కలల రాణి అదిగో అంటున్న నా కనులను...
నేను ఆపగాలనా...
ఓ ప్రియ సఖి ! మరో సారి కనిపించు !!


                                                                         - అను మిట్టసల.    






No comments:

Post a Comment