కరివేపాకు వంటి జీవితం..!
జీవితంలో చాలా మంది ఎన్నో సార్లు ఒంటరిగా మిగిలిపోయ్యము అని అనుకుంటారు.కొంతమందిని తల్లితండ్రులు ఒంటరి వాళ్ళను చేస్తారు,ఇంకొందర్నీ ప్రేమించిన వాళ్ళు,మరి కొందర్ని అభిమానించిన వాళ్ళు .ఇలా జీవితంలో ఒంటరివాళ్ళగానో లేక మనల్ని పక్కన పెట్టేశారనో అనుకుంటూ ఉంటారు.మనం ఎవరో జీవితం నుంచి విసిరివేయబడలేదు.మనం మన జీవితంలోనే కరివేపాకుల్లా మిగిలిపోయ్యాము.ఎలా అంటే? మనిషి జీవితం ఎంత విలువైనదో అంతే రహస్యమైనది.ఎందుకంటే జివిలోంచి జీవుడు ఎప్పుడు? ఎలా? వెళ్ళిపోతాడో తెలియదు.దేహాన్ని వదిలి ఆత్మా పరమాత్మను చేరుకుంటుంది.మన జీవితమే ఎలా సమాప్తమౌతుందో తెలియని మనం,ఈ దేహం మిద అమితమైన ఆశతో,వాంఛలను అందిపుచ్చుకోవాలనే తపనతో నిత్యం పోరాడుతూ నిరాశ,నిస్సప్రుహాలతో జీవితం సాగిస్తూ ఉంటాము.వదిలి వేయటానికి ఎవరి కారణాలు వాళ్లకు ఉంటాయి.అన్నింటిని సమర్దించలేము కాని కొన్నింటిని తప్పక అర్ధం చేసుకోవాలి.ఎవరికీ మంచి చెయ్యకపోయినా చెడు చెయ్యకూడదు కదా.
నాకెప్పుడు అనిపిస్తూ ఉంటుంది: జీవితం చిన్నది కాదు చాలా పెద్దది అని.సరి చెయ్యాల్సినవి,సరి చేసుకోవలసినవి ఈ ప్రపంచంతో పాటు మనలోను చాలానే ఉన్నాయి.
మన బాధలకు,దుఃఖ్ఖాలకు మనమే కారణం తప్ప ఇంకెవరినో నిందించటం తప్పు కదా.జీవితమే శాశ్వతం కానప్పుడు తక్కినవి శాశ్వతంగా ఉండాలి అనుకోవటం ఎంత వరకు కరక్టు.మన ప్రాణమే తన టైం రాగానే మనల్ని వదిలించుకుంటే ఇంక తోటి వ్యక్తులు ఎంత మాత్రులు.ఎవరి జీవితాలు వాళ్ళవి.కూర వండేటప్పుడే కరివేపాకు అవసరం తప్ప తినేటప్పుడు కాదు.అలాగే,ప్రాణం ఉన్నంత వరకే మనిషికి,మనస్సుకు విలువ, అది కాస్త వెళ్ళిపోతే రేపటికి రెండు అనుకుంటుంది సమాజం.అందుకే, కరివేపాకు వంటిది జీవితం అన్నాను.ఇది కేవలం నా అభిప్రాయం.
- అను మిట్టసల.

No comments:
Post a Comment