Pages

అలసిన మనస్సు..!

Saturday, 22 September 2012
                                 అలసిన మనస్సు..!


నీ వెతుకులాటలో బాటసారినైన నేను...
నా మనస్సుకు ఏది ఇష్టమో తెలుసుకోలేక...
మిగిలాను చెందమామ లేని నింగిలా...
నిరంతరం నీ అన్వేషణలో అలసిన మనస్సంటుంది...
  ప్రేమ మరణమంత బలమైనది...
  నిశబ్ధం పాతాళమంత కఠోరమైనది...
  ద్వేషం సముద్రమంత గంభీరమైంది...
  త్యాగం సూర్యుని కిరణమంత తీక్షణమైంది...
  మరుపు నిరపరాధికి పడ్డ ఉరిలాంటిది... అని,
కాలాన్ని సైతం శాసించిన రోజుల్లో...
నా కాలమే నన్ను వదిలించుకుంది...
తన గమ్యం వేరంటూ వెళ్ళిపోయింది...
ఈ రోజులు నావి అని తెలుసుకునే సరికి...
బలమైన అలల తాకిడికి విరిగిన నావలా...
ఎదో ఒక తీరం చేరటం ఇష్టపడక మునిగిపోయాను...
విధి ఆడిన ఆటకి తలవంచి...
మరుపును ఆశ్రయించాను...
మనస్సును ఓదార్స్తున్న నా అంతరాత్మ అంటుంది...
సంతోషం,ప్రేమ,దుఃఖం ఏ ఒక్కరి సొంతం కాదు...
ఇదే జీవితం మిగిల్చే సత్యం...అని.  



                                                          - అను మిట్టసల.

No comments:

Post a Comment