Pages

నాలో నీ ప్రేమ..!

Tuesday, 3 April 2012
            నాలో నీ ప్రేమ..!


మొదటి సారి నీతో మాట్లాడినప్పుడు...
        నీపై నాకు కలిగిన భావం ఏదో తెలియలేదు !
మన మాటల పల్లకి కాళీగా వెళ్ళకుండా...
        ప్రేమను మోసుకొచ్చింది !  
ఇప్పుడు నీతో మాట్లాడాలి అంటే సిగ్గు,బిడియంగా...
       నాకేమౌతుందో తెలియదు !
ఇన్నాళ్ళ ప్రేమను కేవలం ఒక భావంగా మార్చి...
       నువ్వు వేల్లిపోయ్యవు !
ప్రేమించటంలో హెచ్చు తగ్గులు ఉంటాయి అనిపించింది...
       మరచిపోయే వస్తువ్వులో నా ప్రేమను కూడా చేర్చావు !
నాపై నీ ప్రేమ తగ్గిందా? అప్పుడున్నంత ప్రేమ ఏమైపోయింది?   
      ప్రేమించానని స్పష్టంగా చెప్పకుండానే...
ప్రేమించిన నన్ను దూరం చేశావు !
      ఇది ఏ విధమైన ప్రేమో నాకు అర్ధం కావట్లేదు...
ఇలా వుండు,అలా ఉండకు అని అన్ని జాగ్రత్తలు చెప్పానని
      నా మనస్సులో ప్రేమ లేదు అనుకున్నావు !
జీవితాంతం ఆంక్షలు పెడతాననుకొని కనుమరుగైనవా !
      నా మాటల కోసం,ప్రేమ కోసం ఆత్రుతపడ్డ నిన్నుచూసి...
ప్రాణంగా ప్రేమించా !
       నువ్వు మిగిల్చిన చిన్ని చిన్ని జ్ఞాపకాలు...
ఇప్పుడు నా జీవితాన్ని బ్రతికిస్తున్న మందులు !
       ఈ ఎడబాటులో కూడా నువ్వు నాలోనే ఉన్నావు...
మొన్న,నిన్నలతో పోల్చుతూ...అప్పటి నీ ప్రేమ 
       ఎప్పటికి కావాలంటుంది మనస్సు !
నన్ను ఎందుకు వదిలి వెళ్ళావు అని నిన్ను అడగాలనుంది !
      క్షణ క్షణం ప్రేమతో ప్రేమలో జీవిస్తుంటే,గతంగా మిగిలిన ప్రేమ 
ఇంకా నన్ను బ్రతికిస్తున్నవా అంటుంది !
      నిజం ఏంటంటే నన్ను జివింపజేస్తుంది నువ్వే - " ప్రేమ


                                                 - అను మిట్టసల.
 

No comments:

Post a Comment