Pages

కన్నవారి కల..!

Wednesday, 25 April 2012
                     కన్నవారి కల..!

ఇంటర్ రిజల్ట్స్ లో ఫిజిక్స్ సునామి విజ్రుంబిస్తే...
1,44 ,700 విద్యార్దుల తలరాత ఫెయిల్ అయింది...
ఇన్స్టంట్లో జరిగిన తప్పు సరిదిద్దుకోక...
ప్రాణాలు బలి తీసుకోవడానికి బయలుదేరితే...
కన్నవారి కల కన్నిరులో జారిపోతుంది !!

అమ్మ తిట్టిందని,నాన్న కొట్టేడనో...
నువ్వు ఇల్లు వదిలిపోతే... 
నీ కోసం వెతుకులాటలో రోడ్డున పడ్డ కుటుంభం...
బిడ్డ దక్కితే చాలంటున్నా రోధనలో...
కన్నవారి కల కన్నిరులో జారిపోతుంది !!

విరక్తిలో జీవితాన్ని చాలిస్తుంటే...
దారులు వెతుకుతున్న తల్లితండ్రులు...
బావులు వెతుకుతున్న అన్నతమ్ములు...
స్నేహితులను ఆరాతిస్తున్న అక్కాచెల్లెలు...
కడుపు కట్టుకొని నిన్ను పెంచిన వాళ్ళను విస్మరిస్తే...
కన్నవారి కల కన్నిరులో జారిపోతుంది !!

విద్యార్దుల్లారా ఆగండి ! ఒక్క క్షణం ఆలోచించండి...
క్షోబకు గురిచేస్తుంది నీ ' తల్లితండ్రులని '...
నీ లోటు ఎవరు పూ డ్చలేరు అని తెలుసుకోండి...
మీ జీవితం అందంగా తీర్చిదిద్దాలనే వాళ్ళ తపన గ్రహించండి...
కన్నవారి కల తీర్చకున్న...కన్నీరు మిగల్చకండి !!   

                                                      - అను మిట్టసల. 
   

No comments:

Post a Comment