జీవితం
ఎందరో మహానుభావులు అన్నట్టు "ఎంతో చిన్నది జీవితం".ఇది అక్షరాల నిజం.ఇది సత్యం కాకపొతే జీవితం రెండు విదాలుగా ఉంటుంది.గెలిచిన వాడి జీవితం - ఓడిన వాడి జీవితం.విజయం సాధించిన వారి జీవితం ఆదర్శ ప్రాయంగా ఉంటుంది సమాజానికి.ఓడిన వారి జీవితం ప్రయోగాత్మకంగా,అసహనంగా ఉంటుంది.
జీవితం ఎంతో విలువైనది.వయస్సుతోనే ఎంతో జీవితపు అనుభవము సంపాదిస్తాము.మన ప్రమేయం లేకుండా జీవితంలోకి ఎంతోమంది ప్రవేశిస్తారు.కాని,ఎంత మంది మనలో,మనతో చివరి వరకు ఉంటారు.ప్రతిఒక్కరి జీవితంలో ఎదురయ్యై ప్రశ్న ఇది.మన జీవితంలో మనం ఎంచుకున్న వ్యక్తులు కొందరు,మన ప్రమేయం లేకుండ ప్రవేశించిన వారు కొందరు.ఎవరు ఎలా వచ్చినా అందరిని స్నేహంతో,ప్రేమతో ఆహ్వానిస్తాం.అందరిని ఒకేలా ఆదరిస్తాం.
జీవితం ఎంతో విచిత్రమైనది.కొన్ని నిర్ణయాలు ప్రేమతో తీసుకుంటే,మరి కొన్ని ప్రేమ కోసం,ఇంకొన్ని మనిషిలాగా జీవించటం కోసం నిర్ణయాలు తీసుకోని సాగిపోతుంటాం.ఏదిఏమైనా సహజంగా సాగిపోవలసిన జీవితాన్ని ఇష్టంగానో,అయిష్టంగానో ఎన్నో నిర్ణయాలు తీసుకోని జీవించాల్సిన పరిస్థితి...!
మనతో ఉన్నవాళ్ళు మనలాగే ఉన్నారు అనుకుంటాం.కాని,ఎవరి జీవితం వాళ్ళది.సరైన నిర్ణయంతో సాగించాల్సిందే జీవితం.వాళ్ళ కోసం,వీళ్ళ కోసం అంటూ మారుతూ పోతుంటే మన జీవితంలో మనకే స్థానం లేకుండ పోతుంది.అందుకే,సంతోషంగా జీవితం సాగిపోవాలంటే మంచి నిర్ణయం పై ఆదారపడి ఉంటుంది.మన వెనుక తరాల వారికి ఒక 'రోల్ మోడల్' గా ఉండాలంటే జీవితాన్ని సంపూర్ణంగా శోధించి సాధించాలి.ఉన్నతంగా జీవించి ఒక మార్గం ఏర్పర్చుకుందాం.!!
- అను మిట్టసల.
No comments:
Post a Comment