ఈ రోజులో ప్రేమ..!
ప్రేమించటానికి ఒక క్షణం చాలు అన్న విషయం మనందరికీ తెలుసిందే.కాని,ఈ రోజుల్లో ప్రేమ ఏమౌతుందో తెలియట్లేదు.ఏళ్ళ తరబడి ఇష్టపడిన వాళ్ళ చుట్టూ తిరిగి ఎలాగో ప్రేమను సాధిస్తారు.ప్రేమలో ఉన్నప్పుడు ఇరువురిలో ఉన్న లోపాలు ఏమి పెద్ద విషయం అనిపించవు.అన్నింటిని ప్రేమతో సర్దుకుపోతారు.
ప్రేమలో పడ్డ ప్రతి వాళ్ళకు తల్లితండ్రులు,బంధువులు,సమాజం,కులం,మతం,ఆస్థి,అంతస్తు,చదువు,ఉద్యోగం ఇలాంటివి ఏవి అక్కరకురావు.ఇవన్ని అవసరం లేని అంశాలు.ప్రేమకు ఒక మలుపు తిప్పేటప్పుడు మాత్రమే గుర్తుకువస్తాయి.ఫలితంగా,కొన్ని ప్రేమలు ప్రమాదంలో పడుతున్నాయి.తల్లితండ్రులు అడ్డుపడటం ఓల్డ్ ఫాష్యన్,న్యూ ట్రెండ్ ప్రేమికులే ప్రేమకు శత్రువులుగా మారుతున్నారు.ఎందుకు విడిపోతున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి.
ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయి ఏవరో తెలియని వాళ్ళతో జీవితం పంచుకునేదానికి రెడీ అయిపోతున్నారు.ఇద్దరి మనస్తత్వం ఒకేలా ఉంటే పర్వాలేదు.విదిపోయ్యాక వేరేవాళ్ళతో అడ్జస్ట్ కాలేమని ఎందరో మరో జన్మ కోసం ప్రాణం తీసుకుంటున్నారు.ఇంకొందరు,మనస్సు నిండా ప్రేమ మిగిల్చిన మధుర స్ముతులు ,గాయాలు తలుచుకుంటూ,జన్మకు ఈ అనుభవం చాలు అంటున్నారు.
గెలుపు-ఓటమి అన్నవి అన్నింటిలో ఉంటాయి.అవి ప్రేమలో కూడా ప్రవేశించి ఇద్దరి జీవితాలు చిన్నాభిన్నం చేస్తున్నాయి.అందరు ఇలా మారిపోయ్యారు అని అనటం కరెక్ట్ కాదు.జీవితాన్ని ఆనందంగా సాగిస్తున్నవాళ్ళు కూడా ఉన్నారు.నా మనస్సులో ఒకటే ప్రశ్నమెదులుతూ ఉంటుంది.అంతగా ప్రేమించుకున్న వాళ్ళు ఇంకేవరినో ఎలా పెళ్లి చేసుకుంటున్నారు? అని.మార్పు అనేది మనుషులకు దేవుడిచ్చిన వరం అనుకుంటా.ఏది ఏమైనా శిక్ష ఒక్కళ్ళు అనుభవించటం ఎంత క్షోభగా ఉంటుందో.ప్రేమకు పునాది నమ్మకం - కలసి సంతోషంగా బ్రతకటానికి ప్రేమించండి,విడిపోవటానికి ప్రేమించకండి.
- అను మిట్టసల.
No comments:
Post a Comment