Pages

నా జ్ఞాపకం...!

Monday, 2 April 2012
                      నా జ్ఞాపకం...!

నా మనస్సుకు తెలుసు నువ్వు రావని,రాలేవని...
ప్రతి రోజు కలవరపరిచే కలకు తప్ప ! 
నా జీవితంలో నిన్నటి రోజు అలాగే ఎందుకు ఆగిపోలేదో...
నువ్వు పెంచిన దూరంలో నేనుండిపొయ్యాను
అన్ని అర్ధమౌతాయి నీకు...
అందరి కోసం ఆలోచిస్తావు,బాధ పడతావు,సహాయ పడతావు...
కానీ,నేను నీ కోసం బాధ పడకూడదంటావు...
ఇది,నా స్నేహానికి నువ్వు ఇచ్చిన విలువా !
మనస్సుకున్న సున్నిత్తత్వని చూడు...
అపుడు తెలుస్తుంది మనస్సుతో ఆడుకోకుడదని !
జ్ఞాపకాలు మిగల్చాలని నువ్వు అనుకుంటే,
నికే ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాను...
ఆ రోజు నీ బాధ,దుఖ్ఖం నా చెవులకు వినబడవు...
నీ సంతోషం నా కనులకు కనబడదు...
ఎందుకంటే,
           ఎండమావిలో నీరు ఉంటుందా?

                                          - అను మిట్టసల.

No comments:

Post a Comment